-

Beauty And Kitchen Tips: ఉసిరితో అందం ద్విగుణీకృతం.. పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే..

26 Nov, 2021 09:38 IST|Sakshi

Amazing Beauty And Kitchen Tips In Telugu Hair Care And Face Pack: సి విటమిన్‌ పుష్కలంగా కలిగి ఉండే ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఉసిరి పేస్టుతో అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా?

రెండు టేబుల్‌ స్పూన్ల ఉసిరి పేస్టులో టేబుల్‌ స్పూను పెరుగు, టీస్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. రెగ్యులర్‌గా ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల ముఖం మీద, మెడ మీద పేరుకుపోయిన ట్యాన్‌ తగ్గుతుంది.

చర్మంపై ముడతలు తొలగించుకోవచ్చు!
రెండు టేబుల్‌ స్పూన్ల తాజా అలోవెరా జెల్‌లో, టేబుల్‌ స్పూను తేనె, టేబుల్‌ స్పూను గంధం పొడి వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని ముఖం, మెడకు అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్‌ వేసుకోవాలి.

దీనివల్ల అలోవెరా జెల్‌లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తాయి. గంధం పొడి మొటిమలను తగ్గించడమేగాక, చర్మంపై ఉన్న ముడతలను తొలగిస్తుంది.  

ఉసిరికాయ ముక్కలను నాలుగురోజుల పాటు నీడలో ఎండబెట్టాలి. ఈ ముక్కలను కొబ్బరి నూనెలో వేసి రంగు మారేంత వరకు మరిగించాలి. నూనె చల్లారాక తరువాత తలకు రాసుకుని మర్దన చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

శీతాకాలంలో అస్సలు ఇలా చేయొద్దు
చలికాలంలో జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో హెయిర్‌ స్టైల్‌ కోసం ఎటువంటి హెయిర్‌ స్టైలింగ్‌ స్టూల్స్‌ను వాడకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్‌ డ్రైయ్యర్‌ను వాడకూడదు.

కిచెన్ టిప్స్‌:
వంటనూనెలో లవంగాలు వేసి ఉంచితే పాడవకుండా ఎక్కువకాలం ఉంటుంది.
పచ్చిబటానీలను ఉడికించేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
చపాతీ పిండిలో ఉడికించిన బంగాళదుంపను కలపాలి. ఈ పిండితో చపాతీలు చేస్తే చపాతీలు మృదువుగా ఎక్కువసేపు తాజాగా ఉంటాయి.
పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో టీ స్పూను నెయ్యి కలపాలి.
చెక్కతో చేసిన గరిటెలు, చెంచాలు వాసన వస్తుంటే.. వెనిగర్‌ కలిపిన నీటిలో కాసేపు నానబెట్టి తరువాత కడిగి వాడుకోవాలి.  

మరిన్ని వార్తలు