Black Pepper: మిరియాలు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

16 Jul, 2022 00:22 IST|Sakshi

మనం వంటింట్లో ఉపయోగించే వాటిల్లో మిరియాలు ఒకటి. మనలో చాలా మందికి తెలిసిన మిరియాలు నల్ల మిరియాలు. వీటిని జలుబు, దగ్గు, కఫంతోపాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలను తగ్గించడంలో వాడుతూ ఉంటాము.  మిరియాల వల్ల మనకు అనేక ఉపయోగాలు ఉంటాయి.

మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి, గ్యాస్ట్రిక్‌ సమస్యలను తగ్గించడంలో మిరియాలు ఎంతో సహాయపడతాయి. మిరియాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. 
మన జీర్ణాశయంలో అనేక రకాల యాసిడ్‌లు, ఎంజైమ్స్‌ ఉత్పత్తి అవుతాయి. ఇవి ఆహారం జీర్ణం అవ్వడంలో సహాయపడతాయి. అజీర్తి సమస్య ఉన్న వారు మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఈ యాసిడ్‌ లు, ఎంజైమ్స్‌ అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆహారం త్వరగా జీర్ణం అయ్యి అజీర్తి సమస్య తగ్గుతుంది.
మిరియాలను హెర్బల్‌ టీ, నీళ్లు, పాలు, కషాయాలలో వేసి మరిగించుకొని తాగవచ్చు. మిరియాల పొడిని సలాడ్స్, మొలకెత్తిన విత్తనాలపై కూడా వేసుకొని తినవచ్చు. ఈ విధంగా మిరియాలను వాడడం వల్ల గ్యాస్ట్రిక్, అజీర్తి సమస్యల నుండి బయట పడవచ్చు. 
చిటికెడు రాతి ఉప్పు, మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసుకుని, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే చిగుళ్లవాపు తగ్గి రక్తం రావడం వంటివి తగ్గుతాయి.
కొంచెం ఘాటుగా ఉన్నా రోజూ రెండు మిరియాలు నోట్లో వేసుకుంటే శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధం చేస్తుంది. 
టీలో చిటికెడు మిరియాల పోడి వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
మిరియాలు తరచుగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సరే కాదు చర్మ, పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుందని స్టడీస్‌ తేల్చాయి. 
 అరగ్రాము మిరియాల పొడి, గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే.. తలనొప్పి నుంచి ఈజీగా బయటపడవచ్చు. 

మరిన్ని వార్తలు