Health Tips: జీలకర్రను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగుతున్నారా.. అయితే

22 Dec, 2021 11:02 IST|Sakshi

Weight Loss Tips: ఈ డిజిటల్‌ యుగంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.. పొట్ట, కొవ్వు. జీవనశైలితో పాటు ఆహారపుటలవాట్లు ఇందుకు కారణం. బరువు తగ్గి, నాజూకుగా అదే సమయంలో ఆరోగ్యంగా ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు. ఎన్నెన్నో నియమ నిబంధనలు పెట్టుకుంటారు. కానీ ఆచరణ విషయం వచ్చేసరికి.. ఈ బిజీ లైఫ్‌లో మళ్లీ షరా మామూలే. అలాంటి వారు వ్యాయామాలతో పాటు ఈ చిన్న చిట్కాలు పాటించి చూడండి.

పాలు, తేనె: ప్రతి రాత్రి పడుకునే ముందు గ్లాసు వెచ్చని పాలలో 2 టీస్పూన్ల తేనె కలిపి తాగితే హాయిగా నిద్ర పట్టడంతోపాటు, శరీర జీవక్రియను పెంచుతుంది. అధిక కొవ్వును కరిగిస్తుంది. 

వెల్లుల్లి: 2–3 వెల్లుల్లి గర్భాలను చితక్కొట్టాలి. దీనికి  2 టేబుల్‌ స్పూన్ల తేనె, గ్లాసు వెచ్చని నీరు కలిపి తాగాలి. ఇలా కొన్ని వారాలపాటు ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

పుదీనా: పుదీనా తీసుకోవడం జీర్ణవ్యవస్థ పనితీరును, జీవక్రియల వేగాన్నీ పెంచుతుంది. టీస్పూన్‌ పుదీనా రసంతో 2 టీస్పూన్ల తేనె కలిపి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి.

తులసి: తులసిని క్రమం తప్పకుండా తీసుకుంటే, జీర్ణవ్యవస్థకు మంచిది. టీస్పూన్‌ తేనెతో 2 టీస్పూన్ల తులసి రసం కలిపి, పొద్దున్నే తాగాలి. ఈ సహజ మార్గం స్థౌల్యాన్ని తగ్గిస్తుంది. వ్యాధి నిరోధకతను పెంచుతుంది.

నిమ్మ: ఒక గ్లాసు నీటిలో స్పూను నిమ్మరసం, దానికి రెండు టేబుల్‌ స్పూన్ల తేనె కలిపి ఉదయం నిద్ర లేచిన వెంటనే తాగాలి. అలా క్రమం తప్పకుండా కొన్ని రోజులపాటు చేయాలి. 

జీలకర్ర: టీస్పూన్‌ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రిపూట నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం, నీరు మరిగించి, స్పూన్‌ తేనెతో కలిపి ఖాళీ కడుపుతో తాగాలి. మంచి ఫలితం కనిపిస్తుంది.

వీటన్నింటితోపాటు జంక్‌ ఫుడ్స్‌కు వీడ్కోలు చెప్పడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం అవసరం. అన్నింటికన్నా ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది ఏమిటంటే, బరువు లేదా పొట్ట తగ్గడం అనేది కొద్ది రోజుల్లోనే జరిగిపోయే అద్భుతం కాదు. ఓపిగ్గా ప్రయత్నం చేస్తుండాలి. 

చదవండి: How To Lose Belly Fat: బరువు, కొవ్వు రెండూ తగ్గుతాయి.. క్యారెట్‌, మెంతులు, జామ, బెర్రీస్‌, ఇంకా..
Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే..

మరిన్ని వార్తలు