స్మార్ట్‌ పిల్లో.. నిద్రను కనిపెట్టుకొనే దిండు

10 Jul, 2022 15:32 IST|Sakshi

ఈ ఫొటోలో కనిపిస్తున్నది అధునాతనమైన స్మార్ట్‌ దిండు. దీనిపై తలపెట్టుకుని నిద్రించే వారి నిద్రను ఇది కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉంటుంది. నిద్రకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి చక్కని వరప్రసాదం ఈ తలదిండు. అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ (ఏసీఎస్‌) పరిశోధకులు ఇటీవల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్మార్ట్‌ దిండు నమూనాను రూపొందించారు.

ఇందులోని ట్రైబో ఎలక్ట్రిక్‌ నానో జెనరేటర్స్‌తో పనిచేసే సెన్సర్లు నిద్రను అనుక్షణం కనిపెట్టుకుని ఉంటాయి. నిద్రించేటప్పుడు నిద్రించే వ్యక్తికి సౌకర్యంగా ఉండే భగింమ, గాఢంగా నిద్రించే సమయం వంటివన్నీ క్షుణ్ణంగా ట్రాక్‌ చేస్తుంది. ఇప్పటి వరకు హెడ్‌బ్యాండ్స్, రిస్ట్‌బ్యాండ్స్‌ వంటి రూపాల్లో అందుబాటులో ఉన్న స్లీప్‌ ట్రాకర్స్‌ కంటే ఇది చాలా మెరుగ్గా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు