బై‘స్కిల్‌’లుడు

29 Oct, 2023 03:59 IST|Sakshi

వైరల్‌

సైకిల్‌ను మధ్యలోకి మడిచి కారు డిక్కీలో పెట్టుకోవచ్చా? ‘బేషుగ్గా’ అంటున్నాడు ఆనంద్‌ మహీంద్రా. ఎక్కడ ‘స్కిల్‌’ కనిపించినా ఆ విశేషాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా తాజాగా సైకిల్‌ తొక్కుతున్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఇది మామూలు సైకిల్‌ కాదు.

ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్‌ డైమండ్‌ ఫ్రేమ్‌ ఇ–బైసికిల్‌. ఐఐటీ బాంబే స్టూడెంట్స్‌ ఈ బైసికిల్‌ను తయారు చేశారు. ‘మరోసారి మనం గర్వించేలా ఐఐటీ బాంబే స్టూడెంట్స్‌ సృష్టించిన వాహనం ఇది’ అని కాప్షన్‌ పెట్టాడు మహీంద్రా. ‘ఇంప్రెసివ్‌ ఇనోవేషన్‌... రివల్యూషన్‌ ఆన్‌ వీల్స్‌’ అంటూ యూజర్‌లు స్పందించారు.

మరిన్ని వార్తలు