Anant Ambani Marriage: అంబానీ ఇంట పెళ్లికి షారూఖ్‌ పెర్ఫార్మెన్స్‌? ఫీజు అన్ని కోట్లా?

23 Feb, 2024 17:11 IST|Sakshi

అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ పెళ్లి, షారూఖ్‌  ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌

వైరలవుతున్న షారూఖ్‌  ఈవెంట్‌  ఫీజు

పెళ్లికి తరలి రానున్న జాతీయ, అంతర్జాతీయ సెలబ్రిటీలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట  త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముఖేష్-నీతా అంబానీ దంపతుల  చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త కూతురు రాధిక మర్చంట్‌ను పెళ్లాడనున్నాడు.మరి కుబేరుడి ఇంట్లో  పెళ్లి సందడి  క్రేజ్‌ మామూలుగా ఉండదుగా.  ఈ నేపథ్యంలోనే వారి పెళ్లికి సంబంధించి అనేక వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

తాజాగా  బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్ ఖాన్  అనంత్‌-రాధిక  వెడ్డింగ్ వేడుకల్లో ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అతిథులను అలరించనున్నాడని రిపోర్టులు  ద్వారా తెలుస్తోంది. ఇందుకు ఏకంగా రూ. 3-4 కోట్లు డిమాండ్ చేసినట్లు పలు నివేదికలుసూచిస్తున్నాయి. షారుఖ్ ఖాన్‌తో పాటు, బాలీవుడ్ స్వీట్‌ కపుల్‌ రణబీర్, అలియా, అలాగే సింగర్‌ దిల్జిత్ దోసాంజ్ ప్రదర్శనలు కూడా ఉండబోతున్నాయట. 

సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్ ముంబైకి వెళ్లేందుకు జామ్‌నగర్ విమానాశ్రయంలోకి వెళ్లే వీడియో ఒకటి కనిపించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్‌లో నల్ల జాకెట్‌తో, స్టైలిష్ లుక్‌లో కనిపించిన షారుక్‌ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.షారుక్ రిహార్సల్స్ కోసం జామ్‌నగర్‌ను వెళ్లాడంటూ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు.

పలు నివేదికల ప్రకారం జూలైలో వీరి పెళ్లి జరగనుంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయట. అంబానీ ఇంట పార్టీ అంటే పలువురు రాజకీయ, ‍వ్యాపార, క్రీడారంగ ప్రముఖులతోపాటు, బాలీవుడ్‌ సెలబ్రిటీల సందడి కూడా తప్పక ఉంటుంది.  అంతేకాదు మార్చి ప్రారంభంలోప్రీ వెడ్డింగ్ వేడుకలకు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈవో టెడ్ పిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈవో బాబ్ ఇగర్, బ్లాక్‌రాక్ సీఈవో లారీ ఫింక్, అడ్నాక్ సీఈవో సుల్తాన్ అహ్మద్ అల్ జాబర్ పలువురు గ్లోబల్‌ బిజినెస్‌ దిగ్గజాలు కూడా ఈ పెళ్లికి హాజరు కానున్నారని సమాచారం.  

whatsapp channel

మరిన్ని వార్తలు