గుడ్‌ ఐడియా!

21 Nov, 2020 08:22 IST|Sakshi

మారుతున్న కాలానికి తగ్గట్టు మనమూ మారాలి. అంతే కాదు, ఆధునిక సమస్యకు ఆధునికతే పరిష్కారం కావాలి. విషయమేంటో ఇక్కడ కనిపిస్తున్న ఫొటోని చూస్తే అసలు విషయం మీకే బోధపడుతుంది. కరోనా మన జీవితాలను, వ్యాపారాలను ఎంతగా ప్రభావితం చేసిందో తెలిసిందే. చాలామంది బయటి ఫుడ్‌ తినడానికి జంకుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ ఫుడ్‌ స్టాల్‌ వ్యాపారి తన షాప్‌కి ‘యాంటీవైరస్‌ టిఫిన్‌ సెంటర్‌’ అనే పేరును పెట్టుకున్నాడు! ‘ఇక్కడ ఇడ్లీ, దోసె, ఉప్మా, పూరి, సమోసా, వడ అమ్ముతుంటారు.

ఈ స్టాల్‌ను సందర్శించే కస్టమర్లు ఇక్కడి టిఫిన్లను ఎంతగానో ఇష్టపడుతున్నారు’ అంటూ ఓ కస్టమర్‌ ఈ స్టాల్‌ ఫొటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రజలు రెస్టారెంట్లకు రావడానికి, ఆహారపదార్థాల గురించి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఒడిశాలోని బ్రహ్మపూర్‌లోని ఒక ఫుడ్‌ స్టాల్‌ యాజమాని చేసిన ఈ ‘యాంటీ వైరస్‌’ ప్రయత్నానికి అందరూ ఫిదా అవుతున్నారు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు