అనుష్క శర్మకు ఏమయ్యింది? విదేశాల్లో వైద్యం చేయించుకోనున్నారా?

13 Feb, 2024 13:44 IST|Sakshi

బాలీవుడ్‌ నటి అనుష్కశర్మ, స్టార్‌ క్రికెటర్‌  విరాట్‌ కోహ్లీ గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె మళ్లీ గర్భం దాల్చిందంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. దీనికి తోడు స్టార్‌ ఆటగాడైన కోహ్లీ ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ సిరీస్‌ల్లో మూడు సిరీస్‌లకు దూరంగానే ఉన్నాడు. అదీగాక తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉండటంతో ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడనే అంతా అనుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ  ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా లండన్‌లో ఉన్నట్లు సమాచారం.

ఇటీవల స్టార్‌ కపుల్‌ విరుష్కరెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారనే ఊహాగానాలొచ్చాయి. ఇంతలోనే అనుష్కకు ప్రెగ్నెన్సీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నట్టు  వార్తలొచ్చాయి. దీంతో  అనుష్కకు ఏమైంది అంటూ అభిమానుల్లో  ఆందోళన మొదలైంది. నిజంగానే అనుష్క ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందా? అందుకే విదేశాలకు వెళ్లారా? అనే ఊహగానాలకు జర్నలిస్ట్‌ అభిషేక్‌ త్రిపాఠి  ట్వీట్‌ మరింత ఊత మిచ్చింది. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో వారితో సంభాషించిన ట్వీట్‌ను పంచుకున్నారు.

ప్రస్తుతం ఇద్దరూ విదేశాలకు వెళ్లినట్లు ఆ పోస్ట్‌ పేర్కొంది. విరాట్‌ తన కుటుంబంతో గడిపేందుకు వృత్తిపరమైన విరామం తీసుకున్నారనీ, ముఖ్యంగా అనుష్క ఆరోగ్య సమస్యల కారణంగా విదేశాల్లోని వైద్యుడిని సంప్రదించాలని అనుకున్నట్లు ఆ ట్వీట్‌లో ఉంది. అందువల్లే కోహ్లీ తన కుటుంబంతో ఉండేందుకు మ్యాచ్‌లకు కాస్త విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అనుష్కాకు ఏమైందంటూ చర్చలు మొదలయ్యాయి. తొందరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్‌ కమెంట్స్‌ చేశారు.అయితే తాజాగా  ఇంగ్లండ్‌తో జరిగే ఐదో టెస్టు నాటికి కోహ్లి అందుబాటులోకి వస్తాడని, జట్టుతో తిరిగి చేరతాడనేవార్త వెలుగులోకి వచ్చింది. 

సెలబ్రెటీ విషయంలో ఏ చిన్న విషయం బయటకు పొక్కినా.. అదో పెద్ద ఇష్యూగా మారిపోతుంది. ఏం జరిగిందంటూ..సోషల్‌ మీడియాలో పోస్టుల హడావిడి అంత ఇంతాకాదు. వీటన్నింటికి చెక్‌ పడాలంటే..పూర్తి స్పష్టత రావాలంటే  ఏం జరిగిందనేది   విరుష్క  అధికారంగా ప్రకటించాల్సి ఉంది. 

(చదవండి: స్లిమ్‌గా మారిన టాలీవుడ్‌ నటుడు సురేష్‌! ఆయన ఫాలో అయ్యే డైట్‌ ఇదే..!)

whatsapp channel

మరిన్ని వార్తలు