ఏప్రిల్‌ ఫూలదండ.. మార్చి 32..!

1 Apr, 2021 12:51 IST|Sakshi

‘ఏప్రిల్‌ ఫూల్‌’ 
‘ఏప్రిల్‌ కూల్‌’ గా మారాలంటే ఇవ్వాళే ఒక మొక్క నాటండి.

చెబ్బాష్‌!
మీరు ఈ రోజు ‘ఫూల్‌’ అయ్యారా? అయితే కచ్చితంగా గర్వపడండి. ఎందుకంటే మహారచయిత షేక్‌స్పియర్‌ ఇలా అన్నారు: ‘ఫూల్‌ తనను తాను మేధావి అనుకుంటాడు. మేధావి తనను తాను ఫూల్‌ అనుకుంటాడు’

ఏప్రిల్‌ ‘ఫుల్లు’ డే!
ఏప్రిల్‌ ‘ఫుల్లు డే’ అనుకొని బార్లు కిటకిటలాడుతున్నాయి. ఎవరైనా చెప్పండి... ఈరోజు ‘ఏప్రిల్‌ ఫూల్‌ డే’ అని.

మీకు తెలుసా?
అలనాడు దుర్యోధనుడు మయసభలో ‘ఏప్రిల్‌ 1’ నే ఫూల్‌ అయ్యాడు.

దేవదాసు తెలివి
‘ఎవరో నన్ను ఫూల్‌ చేయడం ఏమిటి పారూ...నన్ను నేనే చేసుకుంటాను’ అని దేవదాసు ఇలా చేశాడు...
ఖాళీ బాటిల్‌ ఎత్తి ఖాళీ గ్లాసులో పోశాడు. తాగుతున్నట్లు నటిస్తూ ‘అబ్బా! ఈరోజు ఫుల్లు అయిపోయాను’ అన్నాడు.

తమిళనాడు ఎన్నికల వాక్‌దానం
మా పార్టీని గెలిపిస్తే ‘ఏప్రిల్‌ ఫూల్‌ డే’ మాత్రమే కాదు ‘మే ఫూల్‌ డే’ ‘జూన్‌ ఫూల్‌ డేలు’ కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రానికి తెస్తామని హామీ ఇస్తున్నాం.

ఎవరికి ‘చెప్పు’కోవాలి!
ఆనంద్‌ ఈరోజు చెరువులో గాలం వేశాడు. కొద్దిసేపటి తరువాత చాలా బరువుగా ఏదో తాకింది. ‘పే...ద్ద చేప పడిందోచ్‌’ అని గాలం లాగాడు. రెండు పాత చెప్పులు వచ్చాయి. వాటి మీద ‘ఏప్రిల్‌ ఫూల్‌’ అనే స్టిక్కర్లు అంటించి ఉన్నాయి.

ఈ రోజు అయితే బెస్ట్‌...
ఎవరికైనా లవ్‌ప్రపోజ్‌ చేయడానికి ఈరోజు అయితే బెస్ట్‌. పాస్‌ అయితే సంతోషం. ఫెయిల్‌ అయితే ‘నిన్ను ఫూల్‌ చేయడానికి అలా అన్నానంతే. నాకు అంత సీన్‌ లేదని నీకు తెలి యదా!’ అని మెల్లగా జారుకోవచ్చు.

ఒకరినొకరు...
అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ ట్రంప్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌ను ‘ఫూల్‌’ చేయాలనుకున్నాడు. కిమ్‌కు ఫోన్‌ చేసి ‘హాలో నేను అమెరికా నుంచి కిమ్‌ను మాట్లాడుతున్నాను. బాగున్నారా’ అన్నాడు. కిమ్‌ ఏమన్నా తక్కువ తిన్నాడా? ఫోన్‌ పెట్టేసి వెంటనే ట్రంప్‌కు ఫోన్‌ చేసి ‘నేను కొరియా నుంచి ట్రంప్‌ను మాట్లాడుతున్నాను బాగున్నారా’ అని అడిగాడు.

మార్చి 32
కరోనా కారణంగా ఈరోజు ‘ఏప్రిల్‌ఫుల్‌ డే’ను రద్దు చేయడమైనది. ఈరోజును ‘మార్చి 32’గా మాత్రమే పరిగణించాలని మనవి. 

మరిన్ని వార్తలు