పిల్లలకు ఇవి తినిపించండి... ఆస్తమాకు దూరంగా ఉంచండి

22 Aug, 2021 08:32 IST|Sakshi

ఇటీవల ఆస్తమాతో బాధపడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. చిన్నప్పుడు తాజాపండ్లు, కూరగాయలు అంతగా తినకుండా చాలావరకు ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ తీసుకునే వారు... పెద్దయ్యాక ఆస్తమా బారిన పడడానికి అవకాశాలెక్కువ. అందుకే దాని నివారణకు పిల్లల ఆహారం మీద దృష్టి కేంద్రీకరించాలి. 

పిల్లలకు తినిపించాల్సినవి... 

  • కిస్‌మిస్, బాదం, వాల్‌నట్స్‌ వంటి డ్రై ఫ్రూట్స్, బెర్రీ పండ్లు, బొప్పాయి, ఆపిల్‌ వంటి తాజా పండ్లు, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, కూర అరటి, మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్‌ ‘సి, ఇ, బీటాకెరోటిన్‌’ పుష్కలంగా ఉండే పదార్థాలు పిల్లల చేత తినిపించాలి. 
  • క్యారట్, బీట్‌రూట్‌ (పచ్చిగా తినగలిగినవి), తాజా కాయగూరలు తీసుకోవాలి. 
  • వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆలివ్‌ ఆయిల్,  పాలు రోజూ తీసుకోవచ్చు.
  • ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, ఏలకులు, జీలకర్ర, అల్లం, పసుపు వంటి సహజమైన మసాలా దినుసులతో చేసిన పదార్థాలు ఆస్తమా తీవ్రతను తగ్గిస్తాయి. 

వీటిని ప్రయత్నించి చూడవచ్చు... 

  • పాలలో చిటికెడు పసుపు కలిపి తాగించడం, ఒక స్పూన్‌ పసుపులో అంతే మోతాదులో తేనె కలిపి పరగడుపున తీసుకోవడం... ఉపశమనంతోపాటు నివారణకూ తోడ్పడుతుంది. 
  • పాలు లేదా టీలో అరస్పూన్‌ అల్లం పొడి లేదా మిరియాల పొడి వేసి తాగించాలి.

 ఇవి ఆస్తమాను పెంచుతాయి!
రంగులు వేసిన ఆహారం, ప్రిజర్వేటివ్స్‌తో కూడిన ఆహారం, బ్రెడ్, కూల్‌డ్రింక్స్‌ తీసుకోకపోవడం మంచిది. 

చదవండి : కాకరకాయ కూర తరచూ తింటే చక్కెర అదుపులోకి వస్తుందా? 

మరిన్ని వార్తలు