Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?!

24 Sep, 2022 11:47 IST|Sakshi

బతుకమ్మ వేడుకల్లో భాగంగా తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు తయారు చేస్తారు. ఈ ప్రసాదాల్లో మలీద ముద్దలు మరింత ప్రత్యేకం. మరి మలీద ముద్దలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం!

సాధారణంగా రొట్టె, బెల్లం లేదా చక్కెర కలిపి మలీద ముద్దలు తయారు చేస్తారు. ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పెంచేందుకు డ్రై ఫ్రూట్స్‌ కూడా యాడ్‌ చేసుకుంటారు.

కావాల్సిన పదార్థాలు
►గోధుమ పిండి- కప్పు
►కాజూ(జీడిపప్పు)- 10 గ్రాములు
►పిస్తా- 10 గ్రాములు
►బాదం- 10 గ్రాములు

►సోంపు పొడి- అర టీస్పూను
►యాలకుల పొడి- అర టీస్పూను
►కట్‌ చేసిన ఖర్జూరాలు- ఆరు
►బెల్లం- ఒక కప్పు
►నెయ్యి- రెండు టేబుల్‌ స్పూన్లు

మలీద ముద్దల తయారీ విధానం
►చపాతీ పిండి కలుపుకొని 15 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి మరీ మెత్తగా లేదంటే గట్టిగా కాకుండా చూసుకోవాలి.
►తర్వాత చపాతీలు ఒత్తుకోవాలి
►నెయ్యితో రొట్టెలను రెండు వైపులా కాల్చుకోవాలి.
►చల్లారిన తర్వాత ముక్కలు చేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

►అదే విధంగా.. ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌(కాజూ, పిస్తా, బాదం, ఖర్జూరాలు)ను పొడి చేసుకోవాలి.
►తర్వాత ఒక పాత్ర తీసుకుని అందులో రెట్టెల మిశ్రమం, డ్రై ఫ్రూట్స్‌ పొడి, సోంపు పొడి, యాలకుల పొడి, బెల్లం , నెయ్యి వేసి కలపాలి.
►ఈ మిశ్రమాన్ని ముద్దలుగా కట్టాలి. అంతే మలీద ముద్దలు రెడీ.

ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు
►సాధారణంగా రొట్టెలు కూరలు లేదంటే పప్పుతో కలిపి తింటారు. రొటీన్‌గా కాకుండా ఇలా చపాతీలతో స్వీట్‌ చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు.
►ఇక ఇందులో వేసే కాజూ, పిస్తా, బాదం, ఖర్జూరాల ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాజూలో ఆరోగ్యానికి మేలు చేసే మోనోసాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

►పిస్తా తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులోని కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
►ఖర్జూరాలు శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. వీటన్నింటినీ కలిపి తయారు చేసిన మలీద ముద్దలు తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది.

మరిన్ని వార్తలు