Bathukamma Song Lyrics: ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాము ఆయె చందమామా

29 Sep, 2022 13:15 IST|Sakshi
బతుకమ్మలతో ఆడపడుచుల సందడి

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఆదివారం ఎంగిపూలతో ఆరంభమైన ఈ పండుగ సందడి కొనసాగుతోంది. తొమ్మిదిరోజుల పాటు కోలాహలంగా సాగే ఈ వేడుకలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. పల్లె, పట్నం అంతటా ప్రాచుర్యం పొందిన బతుకమ్మ పాట ఒక్కేసి పువ్వేసి చందమామా.. లిరిక్స్‌ ఈ పండుగ సందర్భంగా మీకోసం..

‘‘ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జాము ఆయె చందమామా
పైన మఠం కట్టి చందమామా.. కింద ఇల్లు కట్టి చందమామా
మఠంలో ఉన్న చందమామా.. మాయదారి శివుడు చందమామా
శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా
గౌరి గద్దెల మీద చందమామా.. జంగమయ్య ఉన్నాడె చందమామా

రెండేసి పూలేసి చందమామా.. రెండు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా

మూడేసి పూలేసి చందమామా.. మూడు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా

నాలుగేసి పూలేసి చందమామా.. నాలుగు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా

ఐదేసి పూలేసి చందమామా.. ఐదు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా

ఆరేసి పూలేసి చందమామా.. ఆరు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా

ఏడేసి పూలేసి చందమామా.. ఏడు జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా

ఎనిమిదేసి పూలేసి చందమామా.. ఎనిమిది జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా

తొమ్మిదేసి పూలేసి చందమామా.. తొమ్మిది జాములాయె చందమామా
శివపూజ వేళాయె చందమామా.. శివుడు రాకపాయె చందమామా

తంగేడు వనములకు చందమామా.. తాళ్లు కట్టబోయె చందమామా
గుమ్మాడి వనమునకు చందమామా.. గుళ్లు కట్టబోయె చందమామా
రుద్రాక్ష వనములకు చందమామా.. నిద్ర చేయబాయె చందమామా’’
సేకరణ : రాచర్ల శ్రీదేవి, భారత్‌ టాకీస్‌ రోడ్, కరీంనగర్‌

చదవండి: Bathukamma Songs: బతుకమ్మ: పుట్టిన రీతి జెప్పె చందమామ! పూర్వకాలం నాటి పాట!
Bathukamma Songs: పుట్టింటికి వెళ్లేందుకు అనుమతి! కలవారి కోడలు ఉయ్యాలో..!

మరిన్ని వార్తలు