Beauty Tips: ముఖంపై మృతకణాలు తొల‌గిపోవాలంటే...

3 Apr, 2022 07:25 IST|Sakshi

పెరుగు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చర్మ సంరక్షణలోనూ అంతే మేలు చేస్తుంది. ముఖంపై కనిపిస్తోన్న మొటిమలను తగ్గించి, సహజసిద్ద మెరుపుని అందించడంలో పెరుగు బాగా పనిచేస్తుంది. పెరుగులోని లాక్టిక్‌ యాసిడ్‌ మృతకణాలను తొలగించి కొత్తకణాల పుట్టుకలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

 

పెరుగుని ముఖానికి, మెడకు అప్లై చేసి గుండ్రంగా కింద నుంచి పైకి మర్దన చేయాలి.
పదిహేను నిమిషాలు ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
రోజుమార్చి రోజు ఈ విధంగా చేయడం వల్ల ముఖ చర్మం మృదువుగా ఫ్రెష్‌గా కనిపిస్తుంది.  
ఇక ల్యాక్టోబాసిల్లస్‌ అసిడోఫిల్లస్‌ అనే మంచి బ్యాక్టీరియా వల్ల మహిళల్లో అనేక ఇన్ఫెక్షన్లు న‌య‌మవుతాయి..
అదే విధంగా మహిళల యోనిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను న‌శింప‌జేసి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

మరిన్ని వార్తలు