Aishwarya Rai Bachchan: నాలుగైదు పూటలు తింటా.. నీళ్లు బాగా తాగుతా.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

16 Jul, 2022 17:00 IST|Sakshi

అందానికే అసూయ పుట్టించే అందం ఐశ్వర్యా రాయ్‌ సొంతం. పెళ్లై, ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా 48 ఏళ్ల ఐష్‌ తన అందాన్ని కాపాడుకుంటోంది. రోజురోజుకీ ఆమె అందం ద్విగుణీకృతం అవుతోందనడంలో సందేహం లేదు.

కాగా మంగళూరులో జన్మించిన ఐశ్వర్య 1994లో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న విషయం తెలిసిందే.

ఓ తరానికి ఆరాధ్య హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ బ్యూటీ సీక్రెట్‌ గురించి ఆమె మాటల్లోనే!

‘‘నాకు జెనెటికల్‌గా అందిన వరం.. మంచి స్కిన్‌. దాన్ని కాపాడుకోవడానికి వంశపారంపర్యంగా అందిన సంపద .. అద్భుతమైన చిట్కాలు. అవీ హైరానా పడకుండా పాటించే సింపుల్‌ సూత్రాలు. ఏం లేదు.. వేయించిన, మసాలా కూరలకు చాలా దూరం నేను.

ఆవిరి మీద ఉడికించిన తాజా కూరగాయలను తింటాను. రైస్‌ విషయానికి వస్తే బ్రౌన్‌ రైస్‌ తీసుకుంటా. మూడు పూటలు  కడుపు నిండుగా తినకుండా కొంచెం కొంచెంగా నాలుగైదు పూటలు తింటాను. మంచి నీళ్లు బాగా తాగుతాను. మా అమ్మ ఇవే పాటిస్తుంది. నేనూ అదే ఫాలో అవుతున్నాను.. చిన్నప్పటి నుంచీ’’. - ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌

చదవండి: Mint Paste Face Pack: పుదీనా పొడి, ముల్తానీ మట్టి, రోజ్‌ వాటర్‌.. మొటిమలు మాయం!

మరిన్ని వార్తలు