మందారం- ఉసిరి: ఈ ఫేస్‌ ప్యాక్‌ వేసుకున్నారో పార్లర్‌కి వెళ్లాల్సిన పనేలేదు!

21 Oct, 2021 12:20 IST|Sakshi

మీ వయసు కంటే పదేళ్ల పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? పని ఒత్తిడి, కాలుష్యం కారణమేదైనా.. చర్మంపై ముడతలు, మచ్చలు, నల్లని వలయాలు, మృతకణాలు ఏర్పడి చర్మాన్ని జీవం కోల్పోయేలా చేస్తుంది. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఫేస్‌ ఫ్యాక్‌ ద్వారా మీ చర్మానికి తిరిగి జీవం పోయొచ్చంటున్నారు బ్యూటీషియన్లు. మందారం, ఉసిరిలతో ఫేస్‌ ప్యాక్‌ ఏ విధంగా తయారు చేసుకోవాలో, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

కావల్సిన పదార్ధాలు
►1 మందారం పువ్వు లేదా 2 టేబుల్‌ స్పూన్ల మందారం పువ్వు పొడి
►1 టేబుల్‌ స్పూన్ తేనె
►2 టేబుల్‌ స్పూన్ల ఉసిరి పొడి లేదా 1 మీడియం సైజు ఉసిరి కాయ

తయారీ ఇలా
►మందారం పువ్వు పొడి లేనట్లయితే ఒక మందారం పువ్వును ఒక రాత్రంతా నానబెట్టి మెత్తగా గ్రేండ్‌ చెయ్యాలి.
►అలాగే ఉసిరి పొడి అందుబాటులో లేకపోతే మీడియం సైజు ఉసిరి కాయను తీసుకుని మెత్తగా పేస్ట్‌ చేయాలి.
►వీటికి తేనె జోడించి అన్నింటినీ బాగా కలుపుకుంటే ఫేస్‌ ప్యాక్‌ రెడీ.

చదవండి: రెస్టారెంట్‌ విచిత్ర షరతు.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు!

ఎలా అప్లై చేయాలంటే..
5-7 నిముషాలు ముఖానికి ఆవిరిపట్టించాలి. ఇలా చేయడం ద్వారా చర్మ గ్రంధులన్నీ తెరచుకుంటాయి. ఫలితంగా ఫేస్‌ ప్యాక్‌లో ఉ‍న్న అన్ని పధార్థాలు చర్మంలోకి చొచ్చుకుని పోయి రెట్టింపు ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖం అంతటా ఫ్యాక్‌లా వేసుకుని 20 నిముషాల పాటు ఉంచుకుని, చల్లని నీటితో కడిగేసుకోవాలి.

ఇవీ ప్రయోజనాలు..
వారానికి కనీసం ఒక్కసారైనా ఈ ఫేస్‌ ప్యాక్‌ వాడితే, దీనిలోని విటమిన్‌ సి, చర్మానికి న్యాచురల్‌ మాయిశ్చరైజర్‌లా పనిచేసి, తడిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడి, చర్మం మెరిసేలా చేస్తుంది. అలాగే మందారం పువ్వు చర్మంలోని మృతకణాలను, మురికిని తొలగించి కాంతివంతం చేస్తుంది. నల్లని వలయాలను, ముడతలను కూడా నివారిస్తుంది.

చదవండి: Health Tips: గుడ్డు, బీట్‌రూట్‌, ఉసిరి, పాలకూర.. వీటితో ఐరన్‌ లోపాన్ని తరిమేద్దాం..!

మరిన్ని వార్తలు