Beetroot Aloe Vera Gel: బీట్‌రూట్‌ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే ఈ క్రీమ్‌ రాసిన తర్వాత..

14 Sep, 2022 11:53 IST|Sakshi

బీట్‌రూట్‌ అలోవెరా జెల్‌తో తయారు చేసిన క్రీమ్‌ను ముఖానికి రాసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉండడమేగాక, అందంగా కనిపిస్తుంది. మార్కెట్లో దొరికే క్రీమ్‌ కంటే ఇంట్లో తయారు చేసినది మరింత బాగా పనిచేస్తుంది.

రెండు టీస్పూన్ల బీట్‌రూట్‌ రసంలో రెండు టీస్పూన్ల అలోవెరా జెల్‌ను వేసి జెల్‌లా చక్కగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని గాలిచొరబడని కంటైనర్‌లో వేసి నిల్వ చేసుకోవాలి.
ముఖాన్ని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి.
ఇప్పుడు బీట్‌రూట్‌ క్రీమ్‌ను ముఖానికి రాసి మర్దన చేయాలి.

ఈ క్రీమ్‌ రాసిన తరవాత ఇతర క్రీములుగానీ, జెల్స్‌గానీ రాయకూడదు.
రోజూ క్రమం తప్పకుండా ఈ క్రీమ్‌ అప్లై చేయడం వల్ల ముఖం మీద మొటిమలు, చిన్నచిన్న పొక్కులు, మచ్చలు తగ్గిపోతాయి.
అలోవెరా జెల్‌లో తొంభై శాతం నీరు ఉండడం వల్ల చర్మానికి మాయిశ్చర్‌ అందుతుంది.
ఈ క్రీమ్‌లోని విటమిన్స్, ఖనిజపోషకాలు, సాల్సిలిక్‌ ఆమ్లం, లిగ్నిన్, సపోనిన్, ఎమినో యాసిడ్స్‌ చర్మసమస్యలను తగ్గిస్తాయి.  

చదవండి: Beauty Tips: వేప, తేనె, పాలు.. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే!
Health Tips: పిల్లలు, వృద్ధులు ఖర్జూరాలు తరచుగా తింటే!

మరిన్ని వార్తలు