Skin Care Tips: మొటిమలు, మచ్చల నివారణకు మంచి రూట్‌

28 Dec, 2022 16:37 IST|Sakshi

బీట్‌రూట్‌ ఆరోగ్య పరిరక్షణకే కాదు, మంచి సౌందర్య సాధనంగా కూడా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి, జింక్‌ పింపుల్స్, వాటి మచ్చలను తొలగించడానికి చాలా సమర్థంగా పనిచేస్తాయి. మీకు పింపుల్స్‌ సమస్య ఉంటే.. ఈ ప్యాక్స్‌ ప్రయత్నించి చూడండి.

రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్‌రూట్‌ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి.

బీట్‌రూట్‌ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. (క్లిక్‌ చేయండి: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్‌తో లాభాలివే!)

మరిన్ని వార్తలు