Beauty Tips: గంధం పొడి, రోజ్‌ వాటర్, నిమ్మరసం.. నేచురల్‌ బ్లీచ్‌!

17 Dec, 2021 13:14 IST|Sakshi

నేచురల్‌ బ్లీచ్‌! 

Natural Face Bleaching Home Remedies: ముఖ చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, ముఖవర్చస్సుని మరింతగా మెరిపించడంలో ఫేషియల్‌ బ్లీచ్‌ బాగా పనిచేస్తుంది. కానీ రసాయనాలతో తయారైన బ్లీచ్‌ల వల్ల కొన్నిరకాల అలెర్జీలు, దద్దుర్లు వంటివి వచ్చి ముఖం పాడైపోతుంటుంది. ఇలాంటి సమస్యలేవి ఎదురుకాకుండా ఇంట్లోనే సులభంగా బ్లీచ్‌ను తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం... 

టీస్పూను పసుపు, టీస్పూను రోజ్‌ వాటర్, అర టీస్పూను నిమ్మరసం, పావు టీస్పూను గంధం పొడి ఒక గిన్నెలో తీసుకుని కలపాలి.

ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు నానబెట్టుకోవాలి. 

ముఖాన్ని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. నానబెట్టిన మిశ్రమాన్ని బ్రష్‌ తో ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు ఆరనివ్వాలి. 

పది నిమిషాల తరువాత టొమాటో లేదా నిమ్మ చెక్కతో ముఖాన్ని గుండ్రంగా ఏడు నిమిషాలపాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. 

తడిలేకుండా తుడిచి, ముఖానికి అలొవెరా జెల్‌ను అప్లై చేయాలి. పదిహేనురోజులకొకసారి ఇలా చేయడం వల్ల ముఖం మెరుపుని సంతరించుకుంటుంది.  


చదవండి: ‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా!

మరిన్ని వార్తలు