Beauty Tips: మ్యాట్‌ లిపిస్టిక్‌ వేసుకునే ముందు ఇవి పాటించండి! లేదంటే

10 Jun, 2022 09:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మ్యాట్‌ లిప్‌స్టిక్‌ క్లాసీగా కనిపించాలంటే..?

Beauty Tips In Telugu: లిప్‌స్టిక్‌ కొనే ముందు దానిలో ఆయిల్‌ కంటెంట్‌ ఎంత ఉందో చూసుకోవాలి. లేదంటే లిప్‌స్టిక్‌ వేసిన తరువాత పెదాలు పగిలినట్లు అవుతాయి. అందుకే మ్యాట్‌ లిపిస్టిక్‌ వేయకముందు పెదాలకు లిప్‌బామ్‌ లేదా కొబ్బరి నూనెతో మర్ధన చేయాలి. 

►లిప్‌లైనర్‌తో అవుట్‌లైన్‌ వేయాలి.
►బ్రష్‌తో కాకుండా ట్యూబ్‌తోనే మ్యాట్‌ లిప్‌స్టిక్‌ను వేసుకోవాలి
►మ్యాట్‌ వేసిన తరువాత కాసేపు చేతులు పెట్టకుండా ఆగాలి. 
►ఈ లిప్‌స్టిక్‌ ఆరడానికి సమయం పడుతుంది కాబట్టి వెంటనే టచ్‌ చేయకూడదు.
►లేదంటే లిప్‌స్టిక్‌ షేపవుట్‌ అవుతుంది. 
►ఇవన్నీ పాటిస్తే మీ మ్యాట్‌ లిప్‌స్టిక్‌ క్లాసీగా, పెదవులు మరింత అందంగా కనిపిస్తాయి. 

చదవండి: Korean Slap Therapy: ముఖ నిగారింపు పెంచుకోవాలంటే.. చెంప చెళ్లుమనాల్సిందే!

మరిన్ని వార్తలు