Beauty Tips: ఇలా చేస్తే మెడపైన పేరుకున్న నలుపు దెబ్బకు వదులుతుంది!

17 Mar, 2022 14:25 IST|Sakshi

నెక్‌ ప్యాక్‌!

Beauty Tips In Telugu: మెడ నల్లగా ఉందని బాధపడుతుంటారు చాలా మంది. కొంతమందికేమో కేవలం స్నానం చేస్తున్నప్పుడు మాత్రమే మెడ కడుక్కునే అలవాటు ఉంటుంది. అలా కాకుండా ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరి.

టీ స్పూను కాఫీ పొడిలో టీస్పూను పంచదార, టీస్పూను ఈనోపొడి, టీస్పూను నిమ్మరసం, టీస్పూను కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన మెడకు అప్లై చేసి పదినిమిషాలపాటు మర్దన చేయాలి.

తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడు సార్లు ఇలా చేయడం వల్ల మెడపైన పేరుకున్న నలుపు వదిలి మెడ సహజసిద్ద రంగులో అందంగా కనిపిస్తుంది. మెడ మీదే కాకుండా మోచేతులు, మోకాళ్ల మీద ఉన్న నలుపునకు కూడా ఈ ప్యాక్‌ అప్లై చేస్తే నలుపు పోతుంది.

ముఖం మరీ మురికి పట్టినట్టు అనిపిస్తే పాలు, మీగడ, పెరుగు, మజ్జిగ ఏది అందుబాటులో ఉంటే దానిని పట్టించి మెల్లగా రుద్దుకోవాలి. ఇవి సహజమైన క్లెన్సర్స్‌గా పనిచేస్తాయి. బయట దొరికే క్లెన్సింగ్‌ మిల్క్‌కు బదులుగా వీటిని వాడవచ్చు.

ముఖాన్ని మామూలుగా శుభ్రం చేస్తున్నప్పటికీ దుమ్ముకణాలు చర్మం లోపలి గ్రంథుల్లోకి వెళ్తాయి. అలాంటప్పుడు ఈ క్లెన్సర్‌ను వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.

చదవండి: Beauty Tips: కొబ్బరి నూనె.. కాఫీ పొడి.. ముఖం మెరిసిపోవడం ఖాయం

మరిన్ని వార్తలు