Beauty Tips In Telugu: చర్మం నల్లగా మారుతోందా? రాత్రివేళ ఈ క్రీములు రాసుకున్నారంటే!

21 Jun, 2022 10:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

దుస్తులు కప్పి ఉంచని చోటా నిగారింపు ఉండాలంటే ఇలా చేయండి

సాధారణంగా దుస్తులు కప్పి ఉంచే భాగాలు మంచి నిగారింపుతోనూ, కప్పి ఉంచని భాగాల్లో అంటే చేతులు, ముఖం మరీ నల్లగానూ ఉండటం మామూలే. కానీ కొన్ని దుస్తులు ధరించినప్పుడు ఈ తేడా ఎక్కువగా కనిపిస్తుండటంతో యువతీ యువకులు మరీ ముఖ్యంగా టీనేజీలో ఉన్నవారు బాధపడుతుంటారు.

సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ అయ్యే భాగాలు అల్ట్రా వయొలెట్‌ కిరణాల కారణంగా కొద్దిగా డార్క్‌గా మారుతుంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ అయ్యే భాగాలు మరీ నల్లగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.  

సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ అయ్యే భాగాలు తేమను కోల్పోకుండా మెరుస్తూ, మంచి నిగారింపుతో ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు... 
ఎండకు ఎక్స్‌పోజ్‌ అయ్యే ప్రాంతంలో చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్‌ ఉండే మాయిశ్చరైజర్‌ పూసుకోవడం మంచిది. 
బయటికి ఎక్స్‌పోజ్‌ అయ్యే శరీర భాగాలు... అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్‌పీఎఫ్‌ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్‌ సన్‌స్క్రీన్‌ను ప్రతి మూడుగంటలకోసారి రాసుకుంటూ ఉండాలి. ఆరుబయట ఎండలో ఉన్నంతసేపు ఈ జాగ్రత్త తీసుకోవాలి. 

గ్లైకోలిక్‌ యాసిడ్‌ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్‌యాసిడ్‌ ఉన్న క్రీములను రాత్రివేళల్లో  చర్మంపై పూసుకోండి.
ఫుల్‌స్లీవ్స్‌ దుస్తులు తొడుగుతున్నప్పుడు ఆ భాగాలు మిగతాచోట్ల కంటే ఎక్కువ నిగారింపుతోనూ, ఫెయిర్‌గానూ ఉండటం తెలిసిందే. అందుకే మామూలు సమయాల్లో వీలైనంతవరకు ఫుల్‌స్లీవ్స్‌ ధరిస్తూ... ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉన్నప్పుడు టీ–షర్ట్స్‌ వేసుకుంటే... ఫుల్‌స్లీవ్స్‌ వల్ల నిగారింపుతో ఉన్న భాగాలు మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. 

ఈ సూచనల తర్వాత కూడా ఎండకు ఎక్స్‌పోజ్‌ అయ్యే భాగాలు, మిగతా భాగాల్లో తేడా ఇంకా ఎక్కువ డార్క్‌గానే ఉన్నట్లయితే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మేలు. వారు కెమికల్‌ పీలింగ్‌ వంటి ప్రక్రియలతో ఈ తేడాను సరిచేస్తారు. 

చదవండి: Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్‌ అంటే? 

మరిన్ని వార్తలు