Beauty Tips: మామిడి పండు గుజ్జు, ఓట్స్‌.. ట్యాన్‌, మృతకణాలు ఇట్టే మాయం!

6 May, 2022 10:00 IST|Sakshi

మామిడి స్క్రబ్‌!

Beauty Tips In Telugu- Mango Scrub Benefits: వేసవిలో లభించే పండ్లలో దాదాపు అందరికీ ఇష్టమైనది మామిడి. పండ్లలో రారాజైన మామిడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే, మామిడిలో కేవలం అనారోగ్యాన్ని దూరం చేసే గుణాలే కాదు అందాన్ని ఇనుమడింపజేసే లక్షణాలు కూడా ఉన్నాయి. మామిడితో ఈ స్క్రబ్‌ ట్రై చేశారంటే మంచి ఫలితం ఉంటుంది.

మామిడి స్క్రబ్‌.. ట్యాన్‌ మాయం!
►నాలుగు టేబుల్‌ స్పూన్ల మామిడి పండ్ల గుజ్జులో మూడు టేబుల్‌ స్పూన్ల ఓట్స్, రెండు టేబుల్‌ స్పూన్ల బాదం పొడి వేసి చక్కగా కలుపుకోవాలి.
►ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి సున్నితంగా మసాజ్‌ చేయాలి.
►ఆరాక చల్లటి నీటితో కడిగేయాలి. 
►ముఖం మీద మచ్చలు, ట్యాన్‌ను ఈ స్క్రబ్‌ చక్కగా తొలగిస్తుంది.
►మామిడి, ఓట్స్‌ను కలిపిన ఈ స్క్రబ్‌ ముఖం మీద మృతకణాలు, దుమ్మూధూళిని తొలగించి చర్మానికి నిగారింపునిస్తుంది.
►వారానికి మూడుసార్లు ఈ స్క్రబ్‌ వాడితే మంచి ఫలితం వస్తుంది. 

చదవండి👉🏾Vitamin B12: విటమిన్‌ బి 12 లోపం లక్షణాలివే! వీటిని తిన్నారంటే..
చదవండి👉🏾Hair Care Tips: వాల్‌నట్స్‌ తింటున్నారా.. ఇందులోని ఆల్ఫాలినోలెనిక్‌ యాసిడ్‌ వల్ల

మరిన్ని వార్తలు