Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో..

12 Oct, 2022 10:25 IST|Sakshi

మొటిమల సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి.
►పదిహేను పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి.
►దీనిలో రెండు టీస్పూన్ల ఓట్స్, రెండు టీస్పూన్ల కీరా రసం, టీస్పూను తేనె వేసి చక్కగా కలపాలి.
►ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూతలా వేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి.
►ఇలా చేయడం వల్ల మొటిమలు పోతాయి. 

తేనెతో పాటు..
పుదీనా ఆకుల పేస్టులో తేనె, రోజ్‌వాటర్‌ వేసి కలిపాలి.
మొటిమలపైన పూతలా వేసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి.  

ఇలా కూడా!
‍కొన్ని పుదీనా, కొన్ని తులసి ఆకులు తీసుకొని బాగా పిండాలి. ఒక నిమ్మకాయ తీసుకుని ఈ రసంలో పిండాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూయాలి. ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి.

చర్మం గరుకుగా ఉంటే..
ముఖంపై చర్మం గరుకుగా అనిపిస్తోందా? అలాంటప్పుడు.. క్యాబేజీని ఉడికించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది.

గుంతలు పోవాలంటే..
మొటిమలు తగ్గిన తర్వాత కూడా వాటికి సంబంధించిన గుంతలు అలాగే ఉంటాయి చాలా మందికి. ఈ సమస్య నుంచి బయపడాలంటే.. ఉడకపెట్టిన బంగాళదుంప గుజ్జును ఓ వారం పాటు రాత్రుళ్లు నిద్రపోయే ముందు ముఖానికి రాస్తే సరి!

చదవండి: Hair Fall Control: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా!
Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

మరిన్ని వార్తలు