Mint Paste Face Pack: పుదీనా పొడి, ముల్తానీ మట్టి, రోజ్‌ వాటర్‌.. మొటిమలు మాయం!

8 Jul, 2022 10:27 IST|Sakshi

ముఖంపై మొటిమలు, జిడ్డు సమస్య వేధిస్తోందా? అయితే, పుదీనా ఆకులతో సమస్యకు ఇలా చెక్‌ పెట్టేయండి!

►పుదీనా ఆకులను ఎండబెట్టి పొడిచేయాలి.
►ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్‌ వేసి పేస్టులా కలపాలి.
►ఈ పేస్టుని ముఖంపై అసహ్యంగా కనిపిస్తోన్న మొటిమలపై రాయాలి.
►పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి.
►ఈ పేస్టుని రోజూ అప్లై చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.
►క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.

అదే విధంగా....
►గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్‌వాటర్‌ జోడించి పేస్టులా నూరాలి.
►ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.
►ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డులేకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. 

చదవండి: Detoxification: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన.. శరీరంలోని విషాలు తొలగించుకోండిలా! ఇవి తింటే మాత్రం..

మరిన్ని వార్తలు