Beauty Tips In Telugu: పంచదార, తేనె, ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మ.. దెబ్బకు జిడ్డు వదులుతుంది!

28 Jun, 2022 10:11 IST|Sakshi

జిగట వదిలించే స్క్రబ్‌

వర్షాకాలంలో  పేరుకుపోయిన మృతకణాలతో ముఖం  జిగటగా ఉంటుంది. ఈ జిగటను తొలగించే స్క్రబ్‌ను  ఇంట్లోనే అత్యంత సులువుగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం...

►కప్పు పంచదారలో టీస్పూను తేనె, అరటీస్పూను నిమ్మరసం, టీస్పూను ఆలివ్‌ ఆయిల్‌ వేసి కలపాలి.
►ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఆరిన తర్వాత సున్నితంగా మర్దన చేసి నీటితో కడిగేయాలి.
►వారంలో రెండు సార్లు ఈ స్క్రబ్‌ అప్లై చేయడం వల్ల జిగటపోయి ముఖచర్మం ఆరోగ్యంగా, కాంతిమంతంగా కనిపిస్తుంది. 

సహజమైన క్లెన్సర్స్‌
►ముఖం మరీ మురికిగా అనిపిస్తే పాలు, మీగడ, పెరుగు, మజ్జిగ ఏది అందుబాటులో ఉంటే దానిని పట్టించి మెల్లగా రుద్దాలి. ఇవి సహజమైన క్లెన్సర్స్‌.
►మార్కెట్‌లో దొరికే  క్లెన్సింగ్‌ మిల్క్‌కు బదులుగా వీటిని వాడవచ్చు.
►రోజూ మామూలుగా ముఖాన్ని శుభ్రం చేస్తున్నప్పటికీ దుమ్ముకణాలు చర్మం లోపలి గ్రంథుల్లోకి వెళ్లి చర్మానికి పట్టేస్తాయి.
►అలాంటప్పుడు కూడా ఈ క్లెన్సర్‌ను వాడవచ్చు.

చదవండి: Health Tips: ఇవి తరచుగా తింటే ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతుంది! అంతేకాదు..

మరిన్ని వార్తలు