Beauty Tips: పసుపు ఐస్‌క్యూబ్‌లతో.. మచ్చలు, వైట్‌ హెడ్స్‌, ట్యాన్‌ మాయం!

25 Jul, 2022 10:17 IST|Sakshi
టర్మరిక్‌ క్యూబ్స్‌తో.. మచ్చలేని అందం

టర్మరిక్‌ క్యూబ్స్‌తో.. మచ్చలేని అందం

ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ముఖ చర్మం జిడ్డుగా, మొటిమలు, బ్లాక్, వైట్‌ హెడ్స్‌ వల్ల నీరసంగా వడలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పసుపు ఐస్‌క్యూబ్‌లతో మంచి పరిష్కారం లభిస్తుంది. 

టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్‌ పొడి, కప్పు రోజ్‌వాటర్, టీస్పూను కొబ్బరి పాలు, ఆరు చుక్కల నిమ్మ నూనెను తీసుకుని ఒక గిన్నెలో వేసి చక్కగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఐస్‌క్యూబ్స్‌ ట్రేలో పోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఈ క్యూబ్‌లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి. 
ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్‌క్యూబ్స్‌తో ఇరవై నిమిషాలపాటు మర్దన చేయాలి.


ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్‌ లేదా అలోవెరా జెల్‌ను రాసుకోవాలి. 
ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్‌ హెడ్స్, ట్యాన్‌ పోయి ముఖం ఫ్రెష్‌గా రేడియంట్‌గా కనిపిస్తుంది.
చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. 
 పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య చాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.  

చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..!
Shilpa Shetty: పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్‌ అదే!

మరిన్ని వార్తలు