పెదవుల మృదుత్వానికి... బ్యూటిప్స్‌

1 Dec, 2020 08:33 IST|Sakshi

కొంతమందికి తరచుగా పెదవులు చిట్లడం,.పై పొర లేచిపోయి పొట్టు రాలడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు అవుతుందంటే... శరీరంలో వచ్చిన మార్పులను, వాతావరణంలోని మార్పులను పెదవులు ఇట్టే ప్రతిబింబిస్తాయి.

  ఇందుకు దారితీసే కారణాలు
 . కాఫీలు ఎక్కువగా తాగడం, ఆల్కహాలు తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. దీనితో పెదవులు పొడిబారుతాయి. 
∙వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఆ మార్పును పెదవులు భరించలేవు. ఎక్కువ చలిని, ఎక్కువ వేడిని తట్టుకోలేక తేమకోల్పోయి పొడిబారతాయి. 
∙పని ఎక్కువైనందువల్ల వచ్చే ఒత్తిడికి శరీర వ్యవస్థలో ఒడిదుడుకులు వస్తాయి. ఆ ప్రభావం మొదట కనిపించేది పెదవులలోనే.
∙లిప్‌స్టిక్‌ల వల్ల ఇరిటేషన్‌ వచ్చినా కూడా పెదవులు పొడిబారి, చిట్లుతాయి.
∙ఏదైనా రుగ్మతకు మందులు వేసుకున్నప్పుడు శరీరం తేమను కోల్పోయినట్లయితేకూడా బయటకు కనిపించే సమస్యల్లో ఇదేమొదటిది.

పెదవులకు సాంత్వన చేకూరాలంటే...
 ఐదు మిల్లీ లీటర్ల గ్లిజరిన్‌లో అంతే మోతాదు నిమ్మరసం, పన్నీటిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారిసాయంత్రం ఒకసారి పెదవులకు పట్టించాలి. పెదవులకు పట్టించి దానంతట అదిఆరే వరకు అలాగే ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని మూడు రోజుల వరకు వాడవచ్చు. మరీ ఎక్కువగా పొడిబారినట్లనిపిస్తే రెండు గంటలకొకసారి కాని ఉదయం రెండు సార్లు, సాయంత్రం రెండు సార్లుకాని పట్టించవచ్చు. ఇవేవీ వీలుకానప్పుడు నీటితోనే మర్దన చేస్తేతాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది. చలికి పెదవులు చిట్లినప్పుడు వేడి నీటిలోదూది ముంచి పెదవులకు పట్టించాలి. ఎండలకు చిట్లినట్లయితే దూదితో చల్లటి నీటినిపట్టించాలి. వీలైతే నీటిలోనే గ్లిజరిన్, వాజలిన్, తేనె ఏదో ఒకటి కొద్దిగా వేసుకోవచ్చు.  లిప్‌స్టిక్‌ కొనేటప్పుడు అందులో వాడినపదార్థాల జాబితాను ఒకసారి సరి చూసుకోవడం తప్పని సరి. బ్రాండెడ్‌ కంపెనీలుతప్పని సరిగా ఈ లిస్ట్‌ను ప్రచురిస్తాయి. మాయిశ్చరైజర్‌ ఉన్న లిప్‌స్టిక్‌నే ఎంచుకోవాలి. సాధారణంగా లిప్‌స్టిక్‌లలో గ్లిజరిన్‌తోపాటు యాంటిసెప్టిక్‌ ప్రాపర్టీస్‌ కూడాఉంటాయి.
 

మరిన్ని వార్తలు