Health Tips: తరుచూ పిల్లల్లో చెవినొప్పి.. ఇలా చేస్తే..

2 Apr, 2022 19:11 IST|Sakshi

వేసవి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆహారం జీర్ణం కావడానికి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే, రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సీజన్‌లో డయాబెటిక్‌ రోగులు ఆహారంలో ఎక్కువ ఫైబర్‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి.

నేరేడు పండ్లతో పాటు దాని గింజలు కూడా షుగర్‌ రోగులకు చాలా మేలు చేస్తాయి. చక్కెరను నియంత్రించడానికి, జామ వినియోగం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. వేసవిలో, ఫైబర్‌ పుష్కలంగా ఉండే జామ పండు జీర్ణవ్యవస్థను చక్కగా ఉంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణమైతే చక్కెర అదుపులో ఉంటుంది. ఇంకా బొప్పాయి, యాపిల్‌ కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.
చదవండి: కీర దోసకాయలు తినేవారు ఈ విషయాలు తెలుసుకున్నారంటే!

►పిల్లల్లో చెవినొప్పి తరచుగా వస్తున్నట్లయితే చెవిలోపల సరిగా శుభ్రం చేయకపోవడమే అందుకు ప్రధాన కారణం కావచ్చు. పిల్లల చెవిలో గులిమి గట్టిపడి శుభ్రం చేయడానికి సాధ్యం కాకుంటే డీ వ్యాక్స్‌ అనే చుక్కల మందును డ్రాపర్‌తో చెవిలో నాలుగు చుక్కలు వేసి కాటన్‌ పెట్టాలి. కాసేపటి తర్వాత నానిన గులిమి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చీర కొంగుతో లేదా దూదితో శుభ్రం చేయాలి. 

►బరువు తగ్గాలనుకునేవాళ్లు కఠోర ఆహారనియమాలు, వ్యాయామాలు మొదలు పెట్టటం కంటే సాధారణంగా ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఎన్ని కిలోలు ఉన్నారో తెలుసుకుని ఎంత బరువు తగ్గితే సరిపోతుంది? ఎంత సమయం తీసుకోవాలి.. అన్న విషయంపై స్పష్టత వచ్చాక నియమాలను పాటించటం మొదలు పెట్టడం ప్రయోజనకరం. 

>
మరిన్ని వార్తలు