పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది.. అప్పుడు ఏమైందంటే..

28 Jan, 2024 00:37 IST|Sakshi

‘పెళ్లి జరగాలంటే?’ అనే ప్రశ్నకు ‘రెండు మనసులు కలవాలి’ అనే సిన్మా డైలాగ్‌ చెబుతాం. బెంగళూరు విషయానికి వస్తే మాత్రం ‘వధూవరులు టైమ్‌కు ఫంక్షన్‌ హాల్‌కు చేరుకోవాలి’ అనే జవాబే వినిపిస్తుంది. బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ అనేది తరచుగా వార్తల్లో ఉండే అంశం. బెంగళూరులో ఒక వధువు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకుపోయింది. మరో వైపు పెళ్లి ముహుర్తం ముంచుకొస్తోంది.

దీంతో బ్రైడల్‌ కారును విడిచి పరుగెత్తుతూ మెట్రో రైలు ఎక్కింది వధువు. ముహుర్తం టైమ్‌కు ముందుగానే ఫంక్షన్‌ హాల్‌కు చేరుకుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో వధువు మెట్రో ఆటోమేటిక్‌ ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తాయి. ‘మెట్రోవాలే దుల్హనియా లేజాయేంగే’ ‘ప్రాక్టికల్‌ పర్సన్‌. విష్‌ హర్‌ గ్రేట్‌ ఫ్యూచర్‌’ ‘స్మార్ట్‌ థింకింగ్‌’... ఇలాంటి రకరకాల కామెంట్స్‌ నెటిజనుల నుంచి వెల్లువెత్తాయి.
 

whatsapp channel

మరిన్ని వార్తలు