గడుసు పిల్లే..! మొత్తానికి తాళి కట్టించుకుంది! వైరల్‌ వీడియో

27 Jan, 2024 13:08 IST|Sakshi

పెళ్లిళ్లలో  ఉండే హడావిడి  అంతా ఇంతాకాదు.  పెళ్లి పనులు మొదలు పెట్టినదగ్గర్నుంచి  ఆ  మూడు ముళ్లు పడేదాకా  అదొక యజ్ఞంలా లాంటిదే.  అందులోనూ అమ్మాయి తరపువారికి అయితే ఈ టెన్షన్‌ మరీ ఎక్కువ.   ఈక్రమంలో బెంగళూరులో జరిగిన ఒక సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఒక పెళ్లి కూతురు  ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో   తెలివైన నిర్ణయం తీసుకుంది.. అసలు ఏం జరిగిందంటే..

మూడుముళ్ల వేడుక కోసం అందంగా ముస్తాబైన,  బెంగళూరుకు చెందిన పెళ్లి కూతురు పెళ్లి మండపానికి బయలు దేరింది.  తీరా భయంకరమైన ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అసలే బెంగళూరులో  ట్రాఫిక్‌ రద్దీ. దీనికి పెళ్లిళ్ల సీజన్‌. ఎటూ కదల్లేని పరిస్థితి. ఇలా అయితే.. ఇక పెళ్లి అయినట్టే అనుకుందో   ఏమోగానీ,  కారు దిగి తన సన్నిహితులతో మెట్రోలో ఎంచక్కా వివాహ  మండపానికి చేరింది.  సమయానికి తాళి కట్టించుకుంది.

పెళ్లి ముస్తాబు, పట్టుచీర నగలతో  వధువు నిశ్చింతగా మెట్రోలో ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అమ్మాయి గడుసుదే అంటే ప్రశంసలు దక్కించుకుంటోంది.  అయితే ఇందులో కొసమెరపేంటి అంటే ఈ వీడియో ఇప్పటిది కాదు.. గత ఏడాది నాటిది.  సోషల్‌ మీడియా పుణ్యమా అంటూ మళ్లీ వైరల్‌ అవుతోంది.

whatsapp channel

మరిన్ని వార్తలు