నిమ్మ ఆకులతో ప్రయోజనాలెన్నో..

20 Feb, 2021 07:41 IST|Sakshi

బ్యూటిప్‌ 

నిమ్మకాయలు ఆరోగ్యానికి ఎంత మంచివో.. ఆకులు కూడా అంతే ఉపయోగమైనవి. నిమ్మ ఆకుల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్‌ ఏ, విటమిన్‌ బీ1, ఫ్లేవనాయిడ్స్, రైబోఫ్లోవిన్, సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటాయి. 

  • నాలుగు తాజా నిమ్మ ఆకుల్ని ఒక గ్లాసు వేడినీటిలో మూడుగంటలు నానబెట్టి తాగితే.. నిద్రలేమి, గుండెదడ, నరాల బలహీనత వంటివి తగ్గుతాయి. వేడినీటిలో మరిగించకూడదు. కేవలం నానబెట్టాలి. అంతే!
  • నీళ్లను వేడిచేసి దించేయాలి. అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్‌ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. 
  • మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు నిమ్మ ఆకుల్ని నలిపి.. ఆ వాసన పీలిస్తే మంచిది. మనసు వెంటనే ఆహ్లాదకరంగా మారుతుంది.
  • నిమ్మ ఆకుల్లో యాంటీబ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకనే నిమ్మను పలు రూపాల్లో సౌందర్య ఉత్పత్తులలో వాడుతున్నారు. 
  • నిమ్మ ఆకుల పేస్టును ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవచ్చు. దీనికి కాస్త తేనె కూడా కలుపుకోవచ్చు. దీనివల్ల ముఖ పర్చస్సు పెరుగుతుంది. 
  • ముఖం మీదున్న మచ్చలు, మొటిమలను కూడా పోగొడతాయివి. 
  • నిమ్మ ఆకుల్ని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. పళ్లలోని బ్యాక్టీరియా నశిస్తుంది. దంతాలు ఆరోగ్యంగా మారతాయి. 
  • స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకుల్ని వేసుకుని స్నానం చేస్తే చర్మ ఆరోగ్యం బావుంటుంది. 
  • నిమ్మ ఆకుల్ని హ్యాండ్‌వాష్‌లా  వాడవచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు పూసుకుంటే చెడు బ్యాక్టీరియా నశిస్తుంది. 
  • వికారం పోవడానికి నిమ్మ ఆకుల్ని వాడవచ్చు. 

>
మరిన్ని వార్తలు