Useful Cleaning Tips: జిడ్డు మరకలా? ద్రాక్ష, నిమ్మకాయ, ఇంకా బ్రెడ్‌తో..

31 Jan, 2022 20:38 IST|Sakshi

సింక్, బాత్‌ టబ్‌లకు అంటుకున్న మొండి, జిడ్డు మరకలను తొలగించడానికి ద్రాక్ష పండు, నిమ్మకాయ, వెనిగర్‌లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. 

► ద్రాక్షపండును సగానికి ముక్కలు కోయాలి. బాత్‌టబ్‌ లేదా సింక్‌పై ఉప్పు చల్లాలి. వాటి మీద ద్రాక్ష పండు సగం ముక్కతో రుద్దాలి. తర్వాత నీటితో శుభ్రం చేయాలి. 
 

వెనిగర్‌ను సింక్‌ టాప్, బాత్‌ టబ్‌లపై చల్లి, గంట సేపు వదిలి, తర్వాత సోప్‌వాటర్‌ని ఉపయోగించి కడిగితే బాగా శ్రుభపడతాయి.
కాఫీ ఫిల్టర్‌  శుభ్రపడాలంటే అందులో బ్లాటింగ్‌ పేపర్‌ని చిన్న చిన్న ఉండలుగా చేసి వేయాలి. అటూ ఇటూ పదే పదే తిప్పాలి. 
(చదవండి: Health Tips: పాలమీగడలో ఏలకులను కలుపుకుని చప్పరిస్తే..)

గోడలపైన వేలి ముద్రల మరకలు నూనె జిడ్డుగా కనిపిస్తుంటాయి. వీటిని వదిలించడానికి బ్రెడ్‌ స్లైస్‌ను తీసుకొని, మరకలపైన రబ్‌ చేసి, తుడవాలి. దీంతో నూనె మరకలు తగ్గిపోతాయి. అదే బ్రెడ్‌తో పగిలిన గ్లాసు ముక్కలను తీయడానికి కూడా ఉపయోగించవచ్చు. 
స్టౌ పై జిడ్డు మరకలు సాధారణంగా అవుతుంటాయి. నిమ్మరసం రాసి, బ్రెడ్‌ లేదా స్పాంజితో తుడవాలి.
(చదవండి: గలిజేరు ఆకును పప్పుతో కలిపి వండుకుని తింటున్నారా)

మరిన్ని వార్తలు