విడాకులకు సిద్ధమవుతున్న హీరోయిన్‌? క్లారిటీ ఇచ్చిన భర్త

22 Feb, 2024 16:20 IST|Sakshi

విడాకులకు సిద్ధమవుతున్న మరో  సెలబ్రిటీ కపుల్‌అంటూ పుకార్లు

ఇంటిపేరు తొలగించి విడాకుల హింట్‌ ఇచ్చిన భామ?

దివ్యా ఖోశలా, భూషణ్‌ కుమార్‌ క్లారిటీ

టీ-సిరీస్ అధినేత, ఆదిపురుష్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌,నటి దివ్య ఖోస్లా కుమార్‌ జంట విడాకులకు సిద్ధమతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. లవ్‌ టుడేతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైన దివ్యా ఖోస్లా ఇన్‌స్టా ఐడీలో  ‘కుమార్’ అనే ఇంటిపేరును తొలగించడంతో విడాకుల పుకార్లకు తెర లేచింది.

అంతేకాదు పేరుకు ముందు 's' ని కూడా జోడించడంతో మరిన్నిసందేహాలు వెల్లువెత్తాయి. అంతేకాదు భర్త భూషణ్ కుమార్ మ్యూజిక్ సంస్థ టీ-సిరీస్‌ సోషల్ మీడియా  ఖాతాను కూడా అన్‌ఫాలో చేసింది.

అయితే ఇవన్నీ పుకార్లేనని  భరత్‌భూషణ్‌ టి-సిరీస్‌  టీం క్లారిటీ ఇచ్చింది.  దివ్య ఖోస్లా  తన ఇంటిపేరు తొలగింపునకు కారణం జ్యోతిష్య శాస్త్రం, ఇది  వ్యక్తిగత నిర్ణయమని దీన్ని గౌరవించాలని టీ సిరీస్‌కి ప్రతినిధి వెల్లడించారు. పేరు ముందు 's' చేర్చడం వెనకాల  కూడా ఇదే కారణమని స్పష్టతనిచ్చారు. ఈ జంట చాలా హ్యాపీగా ఉన్నారని తెలిపారు. 

90ల నాటి పాప్ సంగీతంలో తళుక్కున మెరిసిన ముద్దుగుయ్యే దివ్యా ఖోసలా. ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో ‘అయ్యో రామ’ పెద్ద సంచలనమే సృష్టించింది.తన గ్లామర్‌తో అందర్నీ ఇట్టే ఆకట్టుకుంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ సరసన జిద్ నా కరో యే దిల్ కాతో సహా అనేక మ్యూజిక్  వీడియోలో కనిపించింది.

చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత దివ్య ఖోస్లా కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో ‘హీరో హీరోయిన్‌’ మూవీ,తెలుగు, హిందీలో విడుద‌ల కానుంది. సినిమాకు సురేష్ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ప్రేరణ అరోరా నిర్మిస్తున్న ఈ సినిమాఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది. 

A post shared by Divyakhossla (@divyakhossla)

2005 ఫిబ్రవరి 13న  భూషణ్‌ కుమార్‌ను పెళ్లాడింది.  19 ఏళ్ల వైవాహిక  జీవితంలో ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు ద బ్రేక్‌ తీసుకున్న  దివ్య 2016లో సనమ్‌ రే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.  చివరిగా మీజాన్ జాఫ్రీ , పెరల్ వి పూరితో కలిసి  రొమాంటిక్ డ్రామా   'యారియన్ 2'లో కనిపించింది.  నటిగానే కాదు నిర్మాతగా కూడా అవతరించింది.

whatsapp channel

మరిన్ని వార్తలు