అనన్యా పాండే వేసుకునే దుస్తుల ధర ఎంతో తెలుసా..?

4 Sep, 2022 11:46 IST|Sakshi

స్టార్‌ స్టయిల్‌

స్టార్‌ కిడ్స్‌ అయినా స్పార్క్‌ లేకపోతే ఇండస్ట్రీలో ఫేడౌట్‌  అయిపోతారు. ఆ స్పార్క్‌ ఉంది కాబట్టే అనన్య తనకంటూ ఒక మార్క్‌ క్రియేట్‌ చేసుకుంది. ఆ మార్క్‌ నటనలోనే కాదు ఆమె ఫాలో అయ్యే ఫ్యాషన్‌లోనూ కనబడుతోంది ఇలా...

కెరీర్‌ మొదట్లో ఇతరులు మెచ్చే డ్రెసెస్‌ వేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు నచ్చే..నప్పే డ్రెస్సులే  వేసుకుంటున్నా. నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా నన్ను ట్రోల్‌ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాటిని పట్టించుకోవడం మానేశా.  నాకు నచ్చిన బట్టలు వేసుకున్నానా, ఫొటోలు బాగొస్తున్నాయా? హ్యాపీగా ఉన్నానా.. లేదా అని మాత్రమే చూసుకుంటున్నా.. అదే నాకు ముఖ్యం కూడా. – అనన్యా పాండే

దేవనాగరి..
ఓ పండుగ రోజు అమ్మమ్మ తయారుచేసిన సంప్రదాయ దుస్తులు ధరించడంతో అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియాంకల భవిష్యత్‌ ప్రణాళిక మారిపోయింది. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్‌ కావాలనుకున్నా.. చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్‌ డిజైనింగ్‌. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవనాగరి’ అనే ఓ ఫ్యాషన్‌ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్‌ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్‌ వాల్యూ. చాలామంది సెలబ్రిటీస్‌ వివిధ పండుగల్లో ఈ బ్రాండ్‌ దుస్తుల్లో మెరిసిపోతుంటారు. ధర కాస్త ఎక్కువగానే (రూ. 85,500) ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో ఈ డిజైన్స్‌ లభిస్తాయి. 

ఆమ్రపాలి జ్యూయెలరీ.. 
నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్‌ అరోరా, రాజేష్‌ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, వాటి నకలును రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ని ప్రారంభించారు. ఒరిజినల్‌ పీస్‌ అయితే మ్యూజియంలో, వాటి ఇమిటేషన్‌ పీస్‌ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్‌ బ్రాండ్‌. ఆన్‌లైన్‌లో కూడా ఈ జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. 

మరిన్ని వార్తలు