చదువుకో తమ్ముడా... చదువుకో చదువుకుంటే కలలు పండే కాలమే నీదవుతది

25 Feb, 2024 06:27 IST|Sakshi

వైరల్‌

దిల్లీలోని కమలానగర్‌ మార్కెట్‌కు దగ్గరలో ఉన్న ఫుట్‌పాత్‌పై కూర్చున్న ఒక పిల్లాడు శ్రద్ధగా చదువుకుంటూనే మరో వైపు హెయిర్‌ బ్యాండ్‌లను అమ్ముతున్నాడు. ఇది చూసిన హ్యారీ అనే ఫోటోగ్రాఫర్‌ పిల్లాడితో మాటలు కలిపాడు.

ఆరో క్లాసు చదువుతున్న పవన్‌ తన కుటుంబానికి సహాయంగా ఉండడం కోసం పుట్‌పాత్‌పై హెయిర్‌ బ్యాండ్‌లు అమ్ముతుంటాడు. అలా అని చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయడు. ఏ రోజు పాఠాలు ఆ రోజు శ్రద్ధగా చదువుకుంటాడు. తన కుటుంబ స్థితిగతులను హ్యారీకి చె΄్పాడు పవన్‌.
ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్‌ చేసిన ఈ వీడియో తక్కువ టైమ్‌లోనే పది మిలియన్‌లకు పైగా వ్యూస్‌తో దూసుకు΄ోయింది. పవన్‌ కుటుంబానికి అండగా నిలబడడానికి చాలామంది ముందుకు రావడం మరో విశేషం.

whatsapp channel

మరిన్ని వార్తలు