బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో టాపర్‌

10 Sep, 2023 10:40 IST|Sakshi

పదహారు సంవత్సరాల బ్రిటీష్‌–పాకిస్థానీ మహ్నూర్‌ ఛీమ లండన్‌లోని జనరల్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (జీసిఎస్‌ఈ) లెవెల్‌లో 34 సబ్జెక్‌లలో టాప్‌ గ్రేడ్‌ సాధించి రికార్డ్‌ సృష్టించింది. గణిత శాస్త్రం, ఖగోళశాస్త్రంలాంటి శాస్త్రాలు, ఫ్రెంచ్, లాటిన్‌... మొదలైన భాషలలో అద్భుతమైన ప్రతిభ చూపుతుంది మహ్నూర్‌. ఆమె ఎంచుకున్న 34 సబ్జెక్ట్‌లలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఫిల్మ్‌ స్టూడియోస్, సైకాలజీ... మొదలైన సబ్జెక్ట్‌లు ఉన్నాయి.

‘ఇది మహ్నూర్‌కు మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఈతరంలో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయం’ అని ట్వీట్‌ చేశారు పాక్‌ మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌. ‘వైద్యురాలిగా పదిమందికి సేవ చేయాలి’ అనేది తన జీవిత ఆశయంగా చెబుతుంది మహ్నూర్‌. 

(చదవండి: మీకు తెలుసా!..బ్రెడ్‌తో పాదాల పగుళ్లు మాయం!)

మరిన్ని వార్తలు