పాజిటివ్‌గా నిర్ధారణ అయితే డయాబెటిక్‌ రోగులు మందులు కొనసాగించొచ్చా?

23 Apr, 2021 16:55 IST|Sakshi

కోవిడ్‌ పాజిటివ్‌ అయిన డయాబెటిక్‌ పేషెంట్‌ షుగర్‌కు సంబంధించిన మందులు కొనసాగించాలి. కరోనా ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించడానికి ఇచ్చే స్టెరాయిడ్స్‌తో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి. వాటిని ఇన్సులిన్‌తో కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. కోవిడ్‌ తగ్గాక కూడా స్టెరాయిడ్స్‌ ఇతర కరోనా మందులు కంటిన్యూ చేయాలి. స్టెరాయిడ్స్‌ వినియోగంతో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి కాబట్టి రోజుకు మూడుసార్లు (బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌లకు ముందు) తప్పనిసరిగా ఈ లెవెల్స్‌ చెక్‌ చేసుకోవాలి. 

తినక ముందు 110, తిన్న తర్వాత 160 ఉండేలా చూసుకోవాలి. దానికి తగ్గట్టు ఇన్సులిన్‌ తీసుకోవాలి. తీపి పదార్థాలు పూర్తిగా తగ్గించేయాలి, కొంతమంది ఇష్టమొచ్చిన పండ్లు తినేస్తుంటారు. డయాబెటిక్‌ రోగులు యాపిల్, పైనాపిల్, బొప్పాయి, జామపండ్లు వంటి చక్కెర శాతం తక్కువగా ఉండే పండ్లు తీసుకోవచ్చు. అవికూడా పరిమితంగానే. అనవసర పండ్ల రసాలు మానేయాలి. టీ, కాఫీలు తగ్గించేయాలి. కోవిడ్‌ అంటేనే ఒత్తిడితో కూడుకున్నది. ఇది షుగర్‌ లెవల్స్‌ పెంచుతుంది. అందువల్ల సులభమైన వ్యాయామాలు, వాకింగ్, యోగా వంటివి చేయాలి. 

- డా. ఎ.నవీన్‌ రెడ్డి
జనరల్‌మెడిసిన్, క్రిటికల్‌ కేర్, డయాబెటాలజీ నిపుణులు 

కరోనా సంబంధిత ప్రశ్నలు
కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా?

పిల్లలకు కరోనా వస్తే ప్రమాదమా, మందులతో తగ్గిపోతుందా?

పాజిటివ్‌ వచ్చిన అందరికీ ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరమా?

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు