పొటాటోతో ఫ్యాటీ బాడీకి చెక్‌ చెప్పొచ్చా?

24 Feb, 2022 13:26 IST|Sakshi

ఆలూ ఫ్రై,  ఆలూ సమోసా, ఆలూ పరాటా, ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్, ఆలూ టిక్కీ.. వింటూ ఉంటేనే నోరు ఊరుతోంది కదా. కానీ  వెయిట్‌ లాస్‌ అవ్వాలి అనగానే మనం ముందుగా ఎవాయిడ్‌ చేసే దుంపకూర బంగాళా దుంప. ఆలూ అంటే చాలు అమ్మో ఫ్యాట్‌ అని భయపడిపోతాం. మరి బంగాళాదుంప తింటే నిజంగా బరువు పెరుగుతామా? పొటాటో  లేదా బంగాళా దుంపల్లో ఉండే కార్బోహైడ్రేట్స్, ఫైబర్  మన బాడీకి శక్తినిస్తాయా? అసలు బరువు తగ్గించడంలో  ఆలూ ఎలా సహాయపడుతుంతో తెలుసా?

ఆలు గడ్డ అని లేదా ఉర్ల గడ్డ.. ఏ పేరుతో పిలిచినా దీనికి పెద్ద చరిత్రే ఉంది. బంగాళా దుంపలు అధిక కొవ్వు పదార్ధాలుంటాయని అవి తింటే ఊబయానికి దారితీస్తుందనే అపోహలు  చాలా ఉన్నాయి. కానీ, ఇందులో ఉండే కొవ్వు పదార్ధాలు వాస్తవానికి ఆరోగ్యకరమైనవి,  మన బాడీకి చాలా  అవసరం కూడా. కొవ్వు పదార్దాలే కాకుండా, విటమిన్ సి, విటమిన్ బీ6,  పొటాషియం నిల్వలుఇతర ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాదు థయామిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్, నియాసిన్, మెగ్నీషియం, ఐరన్, జింక్ కూడా లభిస్తాయి. కార్టినాయిడ్స్, పాలీఫినాల్స్ వంటి ఫైటో రసాయనాలు  కూడా ఉన్నాయి. అయితే ఆలూలోని  పోషక పదార్ధాల వినియోగం దానిని  ఎలా తిన్నాం అనేదానిపై ఆధారపడి ఉంటుంది. 


నిజం ఏమిటంటే బంగాళాదుంపను సరైన పద్ధతిలో తింటే అంత చెడ్డది కాదని డైటీషియన్స్‌ చెబుతున్నారు. బంగాళాదుంపలు కొవ్వు పెరుగుదలకు కారణం కాకపోగా బరువు తగ్గడానికి సాయపడుతుంది. ముఖ్యంగా ఒబెసిటీతో బాధపడుతున్న పిల్లలకిచ్చే ఆహారంలో ఆలూ ఉండేలా చూసుకోవడం మంచిది. దీంతో వారు రోజంతా చురుకుగా ఉంటారు. వీటిల్లో ఉండే మంచి కార్బొహైడ్రేట్లు  శరీరానికి సరిపడా శక్తిని సమకూర్చడంలో  సహాయం చేస్తాయి.  వీటిని ముక్కలుగా కోసి, బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు అవెన్లో  బేక్  చేసుకొని తినాలి. ఎటువంటి మసాలాలు లేకుండా  ఆలివ్ నూనె, చిటికెడు ఉప్పు యాడ్‌  చేసిన వేడిగా తీసుకోవచ్చు. దీంతోపాటు వాటర్‌ ఎక్కువగా తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. 

 ఽ

అలాగే ఉడికించిన బంగాళాదుంపలకు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి మాష్‌ చేసి  బేక్‌ చేసుకొని, లేదా పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వేయించి తీసుకుంటేమంచి ఫలితం ఉంటుంది. అల్లం, వెల్లుల్లుకి ఉన్న అధిక కొవ్వును కరిగించే లక్షణం శరీర అధిక బరువును నియంత్రిస్తుంది. పద్ధతి ప్రకారం తీసుకుంటే నడుము, తొడలు, చేతుల చుట్టూ చేరిన అధిక కొవ్వు తగ్గుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు షుగర్‌ను అదుపులో ఉంచుతాయట.  

బంగాళా దుంపల్లో ఉండే డైల్యూటెడ్ ఫైబర్‌, మంచి కార్బోహైడ్రేట్లు ఆకలిని అదుపుచేస్తాయి. దీంతోపాటు పొటాటోలో ప్రోటీజ్ ఇన్హిబిటర్స్-2లో సమృద్ధిగా లభిస్తాయని, ఇవి కొలిసిస్టోకినిన్ అనే హార్మోన్లు కడుపునిండిన అనుభూతినిస్తుందని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. తద్వారా శరీరానికి  ఎక్కువ కేలరీలు అందడాన్ని నిరోధించి, అదనపు కొవ్వు  రాకుండా ఉంటుందన్న మాట. అలాగే బంగాళాదుంపలలో నీటి నిల్వలు మన బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడతాయి. 

సో..బరువు తగ్గాలని భావించేవారు, ఫైబర్ నిల్వలు ఉన్న  ఆలూ లాంటి వాటిని ఎంచుకోవడం మంచిది. ఆహార నియమాలతోపాటు, ఆరోగ్యకర జీవన శైలి, క్రమం తప్పని వ్యాయామం, ధూమపానం మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం బరువును తగ్గించుకోవడంలో కీలక పాత్ర వహిస్తాయనేది మర్చిపోకూడదు. 

మరిన్ని వార్తలు