Hyderabad: సెలబ్రిటీ  ర్యాంప్‌ వాక్‌.. ఫ్యాషన్‌ షో అదుర్స్‌ 

7 Mar, 2022 11:32 IST|Sakshi

ఆమె రన్‌.. అదిరెన్‌

ఫ్యాషన్‌ షో అదుర్స్‌  

మహిళల్లో వచ్చే కేన్సర్లు చాలా వరకు నయం చేయగలిగేనని క్యూర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, అపోలో కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విజయ్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. ఆదివారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో కేన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ‘మైరా’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం సమాజంలో మహిళల విశిష్ట పాత్ర నేపథ్యంగా నిర్వహించిన కార్యక్రమంలో కేన్సర్‌ను జయించిన పిల్లలతో సెలబ్రిటీలు ర్యాంప్‌వాక్‌ చేశారు. కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేశ్‌రంజన్, డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి, గగన్‌ నారంగ్, పుల్లెల గోపీచంద్, మాజీ మంత్రి డీకే అరుణ, శిఖా గోయల్, సినీనటి ప్రగ్యా జైస్వాల్, మధుశాలిని, పద్మశ్రీ అవార్డు గ్రహీత దీపారెడ్డి పాల్గొన్నారు. –మాదాపూర్‌ 

 

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

ఆమె రన్‌.. అదిరెన్‌ 
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వేదికగా షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్‌ను నిర్వహించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, షీ టీమ్స్‌ ఐజీ స్వాతిలక్రా తదితరులు జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.

ఉమెన్స్‌ డే సందర్భంగా తొలిసారి ఓ మహిళను లా అండ్‌ ఆర్డర్‌లో ఎస్‌హెచ్‌ఓగా నియమిస్తామని తెలిపారు. పీపుల్స్‌ ప్లాజా నుంచి ప్రారంభమైన రన్‌ ట్యాంక్‌బండ్‌ పైనున్న లేపాక్షి వరకు సాగి తిరిగి పీపుల్స్‌ ప్లాజాకు చేరింది. రన్‌లో కళాశాలల విద్యార్థినులు, మహిళలు 
పాల్గొన్నారు.       – ఖైరతాబాద్‌

ఫ్యాషన్‌ షో అదుర్స్‌ 
మహిళా దినోత్సవం సందర్భంగా కొండాపూర్‌లోని శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో అంతర్జాతీయ ఫ్యాషన్‌ షో నిర్వహించారు. గ్రాండ్‌ ఫ్యాషన్‌ షోలో పలువురు మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌ చేశారు.  – రాయదుర్గం 

చదవండి: Fashion Blouse Trend: డిజైన్‌లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ!  రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి!

మరిన్ని వార్తలు