ఎంబీఏ చేయాలనుంది. ఏం చేయాలి?

21 Mar, 2021 22:06 IST|Sakshi

కెరీర్‌ కౌన్సెలింగ్‌

నేను ప్రస్తుతం ఐటీలో జాబ్‌ చేస్తున్నాను. నాకు ఎంబీఏ చేయాలనుంది. ఏం చేయాలో చెప్పండి?
                                                                                                                                     –నగేశ్

  • చాలామంది టెక్నికల్‌ కోర్సుల విద్యార్థులు తమకు ఉన్నత చదువులు చదవాలని ఉన్నా.. క్యాంపస్‌ ఎంపికల్లో ఆఫర్‌ రావడంతో అందులో చేరిపోతున్నారు. మంచి వేతనంతో పాటు సౌకర్యాలు అందిస్తుండటంతో అదే జాబ్‌లో కొనసాగుతుంటారు. కానీ కొంతకాలానికి ఉన్నత విద్య కోర్సు చదువుదాం అనే ఆలోచన మొదలవుతుంది. ఇప్పుడు చేస్తున్న జాబ్‌ను వదిలి మళ్లీ కోర్సులో చేరాలంటే.. కుటుంబం నుంచి మద్దతు లభించదు. చేతిలో ఉన్న ఉద్యోగం వదిలేయడం సరైన నిర్ణయం కాదని సన్నిహితులు సూచిస్తుంటారు. ఇవన్నీ సర్వ సాధారణమే!
  • మీరు ఐటీ ప్రొఫెషన్‌లో ఉన్నారు. ఇంజనీరింగ్‌ నేపథ్యంతో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌లో చేరి ఉంటే.. ఐదారేళ్ల అనుభవం తర్వాత మరింత ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ఎంబీఏ ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు ఐటీ జాబ్‌లో ఐదేళ్లు ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నట్టయితే.. ఎంబీఏ చేయాలన్న మీ ఆలోచన సరైనదే. దీనిద్వారా మీరు కెరీర్‌లో మేనేజ్‌మెంట్‌ విభాగంలోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న కెరీర్‌లో మరింత ఉన్నతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. 
  • వాస్తవానికి చాలామంది ఇంజనీరింగ్‌ పూర్తికాగానే ఎంబీఏలో చేరిపోతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం–బీటెక్‌ పూర్తికాగానే ఎంబీఏలో చేరడం వల్ల తమకు ఏ స్పెషలైజేషన్‌ నచ్చుతుందో సరిగా అంచనా వేయలేరు. దానివల్ల ఎంబీఏ చేసిన రెండేళ్ల కాలం నష్టపోతున్నారు. మరోవైపు ఎంతో విలువైన ఉద్యోగ అనుభవం అవకాశం కూడా కోల్పోతున్నారు. 
  • మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో రెగ్యులర్‌ ఎంబీఏ, పీజీడీపీఎం, పీజీడీఎం వంటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఫుల్‌టైమ్‌ టైమ్‌ కోర్సులు. వీటిని తప్పనిసరిగా విద్యా సంస్థకు వెళ్లి చదవాల్సిందే. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న వారికి అనువుగా ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ అందుబాటులో ఉంది. ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా అనుభవం పొందిన వారు ఎంబీఏతో మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. 
  • ఐటీ ప్రొఫెషన్స్‌లో ఉన్నవారికి అనువైన ఎంబీఏ స్పెషలైజేషన్స్‌.. ఎంబీఏ–ఐటీ లేదా టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌ » ఎంబీఏ–ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ » ఎంబీఏ–బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ » ఎంబీఏ–ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మేనేజ్‌మెంట్, ఎంబీఏ–స్ట్రాటజీ మేనేజ్‌మెంట్‌ » ఎంబీఏ–కన్సల్టింగ్‌ మేనేజ్‌మెంట్,–ఎంబీఏ–ఫైనాన్స్‌ లీడర్‌షిప్‌ » ఎంబీఏ–ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌ » ఎంబీఏ–ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌. ఇలాంటి స్పెషలైజేషన్స్‌ను ఎంచుకోవచ్చు. 
మరిన్ని వార్తలు