కాసనోవా ఆత్మకథ ఇప్పటికీ హాట్‌కేకే‌

9 Apr, 2021 12:25 IST|Sakshi

‘కాసనోవా ఎవరు?’ అనే ప్రశ్నకు ‘వరల్డ్‌ గ్రేటెస్ట్‌ లవర్‌’ ‘ఆయనకు 130 మంది లవర్స్‌’ ‘ఆయన చూపుల మాయజాలంలో ఎంత అందగత్తె అయినా చిక్కుకుపోవాల్సిందే’....ఇలా ఎన్నో వినిపిస్తాయి. కాసనోవా ఆత్మకథ ఇప్పటికీ హాట్‌కేకే!.

కాసనోవాపై ఆసక్తితో ఆయన గురించి చరిత్రకారులు ఎప్పటికప్పడూ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. తాజా పరిశోధన చెప్పేదేమిటంటే...కాసనోవా మంచి వైద్యుడు అని. ఆయన వైద్యుడు కాలేకపోయినా(ఫెయిల్డ్‌ డాక్టర్‌) వైద్యశాస్త్రం పట్ల ఆసక్తిని మాత్రం వదులుకోలేదు. ఎన్నో వైద్య పుస్తకాలు చదివేవాడు. వైద్యానికి సంబంధించి ఆయన ఆలోచనలు, పరిశీలనలు, అంచనాలు చాలా విలువైనవి అంటున్నారు పరిశోధకులు. మొటిమల నివారణ నుంచి గర్భస్రావరం వరకు ఆయన స్త్రీలకు ఎన్నో సలహాలు ఇచ్చేవాడట. ఆయన చరిత్రపై ‘శృంగారపర్వం’ మాత్రమే డామినెట్‌ చేయడంతో ఆయనలోని నిపుణుడైన వైద్యుడి గురించి ఎవరూ పట్టించుకోలేదు.

వెనిస్‌లో జన్మించిన గియాకోమో జిరోలామో కాసనోవా... సైనికుడు, జూదరి, వ్యాపారి, సాహసికుడు, రచయిత.. ఇలా ఎన్నో కావాలనుకున్నాడు.. పదిమందిలో పేరు తెచ్చుకోవడానికి కాదు, పలువురు స్త్రీల మనసు దోచుకోవడానికి! ఒకానొక సమయంలో కాసనోవా డిప్రెషన్‌లోకి వెళ్లాడు. దాని నుంచి బయటపడడానికి రోజుకు 10 గంటలు తన జ్ఞాపకాలను రాసేవాడు. ‘ఐసోలేషన్‌’ అనే మాట ఇప్పుడు చాలా గట్టిగా వింటున్నాంగానీ ఆరోజుల్లోనే కాసనోవా ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. కరోనా కాదు సుమీ! తన ఆత్మకథ ‘స్టోరీ ఆఫ్‌ మై లైఫ్‌’ పూర్తిచేయడానికి. ఈ పుస్తకం పై ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ 18వ శతాబ్దంలో యూరోపియన్ల సాంఘిక జీవితాన్ని సాధికారికం గా చెప్పిన పుస్తకం అనడంలో ఎవరూ విభేదించరు.

చదవండి: పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి
ఇల్లు – ఆఫీస్‌ వేగం తగ్గినా రన్నింగే

 

మరిన్ని వార్తలు