మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!

15 Sep, 2023 10:59 IST|Sakshi

 ఈ ప్రపంచంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. శాస్త్రవేతలు లేదా మేధావుల కారణంగానో ఆ కొంగొత్త విషయాలు వెలుగులోకి వస్తే ఇలాంటివి కూడా ఉ‍న్నాయా!.. అని నోరెళ్లబెడతాం. అలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందాం. 

మంచి ఆసక్తికర విషయాలు..

  • ఇంతవరకు ఆంగ్లవర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపించే వాక్యం గురించి ఆలోచించారా. అస్సలు అలాంటి వెరైటీ వాక్యం ఒకటి ఉంటుందన్న ఆలోచన వచ్చిందా. తెలుసుకోకపోయిన ఏం ఫర్వాలేదు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకోండి. ఇంతకీ ఆ వాక్యం ఏంటంటే.. ‘ది క్విక్‌ బ్రౌన్‌ ఫాక్స్‌ జంప్స్‌ వోవర్‌ ది లేజీ డాగ్‌’ అనే వాక్యాన్ని గమనిస్తే ఆంగ్ల వర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపిస్తాయట. నిశితంగా గమనిస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది. 
  • అలానే ఎన్నో రకాల వింత వింత ఫోబియాలు గురించి వినుంటారు. సంతోషం అంటే భయపడే ఫోబియా గురించి విన్నారా. అస్సలు అలాంటిది ఒకటి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఔను మీరు వింటుంది నిజమే! . అలాంటి విచిత్రమైన ఫోబియా ఉందంట..దాన్ని చెరోఫోబియా అని పిలుస్తారట. సంతోషంగా ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే కొందరు మాత్రం సంతోషంగా ఉండేందుకు భయపడతారట. దీనికి కారణం సంతోషంగా కనిపిస్తే ఎక్కడ కీడు జరగుతుందోననే మూఢ నమ్మకంతో సంతోషంగా ఉండరట. ఇది రాను రాను సంతోషంగా ఉండాలంటేనే భయపడేంతగా మారుతుందట. అందుకే ఈ లక్షణాన్ని చెరోఫోబియా అంటారు. 
  • చాలామంది ఎందువల్ల తెలియదు కొన్ని దురలవాట్లు ఉంటాయి. దూరం చేసుకోవాలనుకున్న ఏదో బలహీనత మళ్లీ ఆ చెడ్డఅలవాటే దగ్గరికి వెళ్లేలా చేస్తుంది. ఈ అలవాట్ల నుంచి ఎలా బయటపడాల్రా బాబు అని తలపట్టుకుంటారు. అలాంటి వాళ్లు నిజంగా మారాలి అని గట్టిగా కోరుకుంటే మాత్రం ముందుగా ఆ దురలవాటు జోలికి వెళ్లకుండా ఓ 21 రోజులు ట్రై చేస్తే చాలట. ఇక​ వాళ్లకి తెలియకుండానే ఆ అలవాటు నుంచి బయటపడతారట. అధ్యయనంలో తేలిందని నిపుణులు చెబుతున్నారు. 
  • ఇక కొన్ని కొత్త పదాలు ఓ పట్టాన అర్థం కావు. ఆంగ్ల పదంలా ఉన్న వేరే భాష మాదిరిగా ఉంటాయి. ఎందకంటే ఆ పదం అర్థం కాక. అట్లాంటి పదమే   ‘వోవర్‌ మారో’. ఐతే దీని అర్థం వింటే ఓస్‌ ఇంతేనా అనేస్తారు. దీని అర్థం ది డే ఆఫ్టర్‌ టుమారో అని అర్థమట అంటే ఎల్లుండి అని.

(చదవండి: ఏకే ఫ్లవర్‌ కాదు  ఫైర్‌ బోల్ట్‌! అతి పెద్ద స్మార్ట్‌ వాచ్‌ బ్రాండ్‌!)

మరిన్ని వార్తలు