చికెన్‌ దోశ.. ఇలా వేసేద్దాం!

4 Jul, 2021 13:25 IST|Sakshi

కావలసినవి: దోశ పిండి, చికెన్‌ ముక్కలు– 200గ్రాములు, కరివేపాకు– రెండు రెమ్మలు, ఉల్లిపాయ–ఒకటి, జీలకర్ర– అరటేబుల్‌ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్టు–టేబుల్‌ స్పూను, సన్నగా తరిగిన పచ్చి మిర్చి– ఒకటి, మిరియాలపొడి– టేబుల్‌ స్పూను, కారం –అరటేబుల్‌ స్పూను, పసుపు –అరటేబుల్‌ స్పూన్, గరం మసాల–టేబుల్‌ స్పూన్, కొత్తిమీర తరుగు–టేబుల్‌ స్పూను, టమోటా ప్యూరీ– టేబుల్‌ స్పూను, నెయ్యి–రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు, ఆయిల్‌–తగినంత.


తయారీ:

► స్టవ్‌ మీద ప్యాన్‌ పెట్టి మూడు టేబుల్‌ స్పూన్ల ఆయిల్‌ వేసి కాగనివ్వాలి. ఆయిల్‌ వేడెక్కిన తరువాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు రంగు మారిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ వేసి కలపాలి

► ఇవన్నీ వేగి కాస్త ఆయిల్‌ పైకి తేలిన తరువాత గరం మసాల, కారం, కొత్తమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాలు వేగనివ్వాలి ∙వేగాక అరకప్పు నీళ్లు పోసి చికెన్‌ ముక్కలు వేసి పదిని నిమిషాలపాటు ఉడకనివ్వాలి.

చికెన్‌లో నీళ్లన్నీ అయిపోయి డ్రైగా మారిన తరువాత స్టవ్‌ ఆపేసి పక్కన పెట్టాలి  దోశ వేసే ప్యాన్‌ పెట్టి దోశను పలుచగా వేయాలి. దాని మీద చికెన్‌ మిశ్రమం, నెయ్యి వేసి దోశంతా పరిచేలా రాయాలి. తరువాత దోశను రోల్‌ చేసి ఐదు నిమిషాలు కాలనిస్తే క్రిస్పి చికెన్‌ దోశ రెడీ అయినట్లే. 

మరిన్ని వార్తలు