మీ హార్ట్‌ బ్రేక్‌ అయ్యిందా? పెళ్లి ఫోటోలు ఈ స్టూడియోకి తెచ్చిస్తే సరి!

12 Dec, 2023 12:13 IST|Sakshi

ఫొటోలు బాగా తీసే స్టూడియోలున్నట్లే.. ఫొటో హార్డ్‌ కాపీలను చిత్తు చిత్తుగా చించేసే స్టూడియో కూడా ఉంది.. రష్యాలో! పెళ్లి ఫెయిలై.. విడాకులు తీసుకున్న చాలామంది దంపతులు తమ పెళ్లి ఫొటో హార్డ్‌ కాపీలను చించేయడానికో, కాల్చేయడానికో సెంటిమెంట్‌ అడ్డొచ్చి, బయట పడేస్తే ఆ ఫొటోలను మిస్‌ యూజ్‌ చేసే ప్రమాదం ఉంటుందని భయపడి.. ఇలా రకరకాల కారణాలతో వాటిని ఏమీ చేయలేక.. అలాగని ఇంట్లో పెట్టుకోనూలేక సతమతమవుతుంటారు.

ఆ బాధను అర్థం చేసుకున్న లియు బైలు అనే వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని ఇంప్లిమెంటే చేశాడు ‘వెడ్డింగ్‌ ఫొటోస్‌ ష్రెడింగ్‌ బిజనెస్‌’ స్టూడియోతో! డైవోర్స్‌ తీసుకున్న కపుల్స్‌ తమ పెళ్లి ఫొటోలను ఈ స్టూడియోకి తెచ్చిస్తే.. ఫోటోలను స్ప్రే పెయింట్‌తో కప్పేసి.. వాటిని ష్రెడింగ్‌ మెషిన్‌లో వేసి నుజ్జు నుజ్జు చేసేస్తాడట. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి ఆ ఫుటేజ్‌ని  క్లయింట్‌కు పంపుతాడు. ఇప్పుడు ఇతని స్టూడియోకి విపరీతమైన గిరాకీ పెరిగి మూడు ఫొటోలు ఆరు రూబుళ్లుగా బిజినెస్‌ సాగుతోందట.  

>
మరిన్ని వార్తలు