క్రిస్పీ కుకీస్‌.. ఆనందంగా తింటే బావుంటుందేమో

20 Dec, 2020 11:31 IST|Sakshi

క్రిస్మస్‌ పండుగ వస్తోందంటే... స్టార్‌ వెలుగులు.. ప్రార్థనలు... బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. క్రిస్మస్‌ ట్రీని అలంకరించడం. శాంతాక్లాజ్‌ పిల్లలను ఆడించడం... ఎంత హడావుడో... పండగంటే పిల్లలకు ఏదో ఒకటి చేయాలిగా...అందుకే ఈ పండుగకి సరదాగా కుకీస్‌ చేసి...అందరూ ఆనందంగా తింటే బావుంటుందేమో కదా.. ప్రయత్నించి చూడండి...


గోధుమ బిస్కెట్స్‌
కావలసినవి:
గోధుమ పిండి – అర కప్పు; కరిగించిన నెయ్యి/ వెన్న – 3 టేబుల్‌ స్పూన్లు; ఉప్పు – చిటికెడు; పంచదార/ బెల్లం పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; వెనిలా ఎసెన్స్‌ – అర టీ స్పూను.

తయారీ:

  • ప్రెజర్‌ కుకర్‌ లేదా మందపాటి అడుగు ఉన్న పాత్ర తీసుకోవాలి
  • ఒక పొరలాగ ఉప్పు లేదా ఇసుక వేసి, దాని మీద స్టాండు అమర్చాలి
  • ముందుగా కుకర్‌ను పెద్ద మంట మీద పది నిమిషాలు వేడి చేయాలి
  • ఒక పాత్రలోకి కరిగించిన నెయ్యి, పంచదార లేదా బెల్లం పొడి, వెనిలా ఎసెన్స్, ఉప్పు తీసుకుని బాగా కలపాలి టగోధుమ పిండి జత చేసి మరోమారు కలిపి, మూత పెట్టి, పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి
  • మిశ్రమాన్ని బయటకు తీసి, సమాన పరిమాణంలో ఉండలు చేసి చేతితో గుండ్రంగా అదమాలి (కావాలనుకుంటే ఫోర్క్‌ సహాయంతో డిజైన్‌ గీసుకోవచ్చు)
  • అల్యూమినియం పాత్రకు నెయ్యి లేదా వెన్న పూయాలి
  • తయారుచేసి ఉంచుకున్న కుకీలను ఇందులో దూరం దూరంగా ఉంచాలి
  • మంట బాగా తగ్గించి, పదిహేను నిమిషాల తరవాత స్టౌ మీద నుంచి దించేయాలి
  • పది నిమిషాల తరవాత కుకర్‌ మూత తీయాలి
  • కుకీలను జాగ్రత్తగా బయటకు తీసి, గ్రిల్‌ వంటి దాని మీద జాగ్రత్తగా ఆరబెట్టాలి
  • పూర్తిగా చల్లారిన తరవాత కుకీలను గాలిచొరని డబ్బాలో భద్రపరచాలి.

క్యారట్‌ ఆపిల్‌ కుకీస్‌
కావలసినవి:
మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్‌ పౌడర్‌ – టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; అల్లం ముద్ద – టీ స్పూను; జాజి కాయ పొడి – చిటికెడు; బటర్‌ (ఉప్పు లేనిది) – ముప్పావు కప్పు; పంచదార – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; బ్రౌన్‌ సుగర్‌ – పావు కప్పు; కోడి గుడ్డు – 1; వెనిలా ఎసెన్స్‌ – అర టీ స్పూను; క్యారట్‌ తురుము – కప్పు; ఆపిల్‌ తురుము – అర కప్పు.

తయారీ:

  • ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు, అల్లం ముద్ద, దాల్చినచెక్క పొడి, జాజి కాయ పొడి వేసి బాగా కలపాలి
  • మరో పాత్రలో బటర్‌ వేసి మెత్తగా అయ్యేలా గిలకొట్టాలి టపంచదార, బ్రౌన్‌ సుగర్‌ జత చేసి మరో రెండు నిమిసాల సేపు గిలకొట్టాలి
  • కోడి గుడ్డు సొన జత చేసి మరో మారు గిలకొట్టాక, వెనిలా ఎసెన్స్‌ జత చేసి బాగా కలపాలి
  • చివరగా మైదా పిండి మిశ్రమం జత చేసి నెమ్మదిగా గిలకొడుతూ మిశ్రమం మెత్తగా గట్టిగా వచ్చేలా చేయాలి
  • రబ్బర్‌ స్పూన్‌తో కలుపుతూ క్యారట్‌ తురుము, ఆపిల్‌ తురుము కూడా జత చేసి మిశ్రమం అంతా బాగా కలిసేలా చేయాలి
  • గుండ్రంగా కట్‌ చేసి, వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో ఉంచి సుమారు ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉంచి, దించేయాలి
  • చల్లారిన తరవాత ప్లేట్లోకి తీసుకుని, మరింత చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి.

ఆపిల్‌ కొబ్బరి దాల్చిన చెక్క కుకీస్‌
కావలసినవి: ఆపిల్స్‌ – 3 (తొక్క తీసి సన్నగా తురమాలి); బాదం మీల్‌ – 2 కప్పులు (బాదం పప్పుల తొక్క తీయకుండా మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా చేయాలి); ఎండు కొబ్బరి తురుము – ఒక కప్పు; కోడి గుడ్లు – 3 (గిన్నెలో వేసి గిలకొట్టాలి); కొబ్బరి నూనె – 2 టీ స్పూన్లు; వెనిలా ఎసెన్స్‌ – 2 టీ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి –  టీ స్పూను.

తయారీ:

  • కుకర్‌ను ముందుగా వేడి చేసి ఉంచుకోవాలి టఆపిల్‌ తురుమును బ్లెండర్‌లో వేసి మెత్తగా చేయాలి
  • ఒక పాత్రలో ఆల్మండ్‌ మీల్, దాల్చిన చెక్క పొడి, కొబ్బరి నూనె, వెనిలా ఎసెన్స్‌ వేసి బాగా కలపాలి
  • ఆపిల్‌ గుజ్జు, ఎండు కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి టకోడి గుడ్డు సొన కూడా జత చేయాలి
  • కుకీ తయారు చేసుకునే పాత్ర మీద ఈ మిశ్రమాన్ని పోసి సమానంగా పరచాలి
  • కుకర్‌లో ఉంచి సన్నని మంట మీద ఇరవై నిమిషాలు ఉంచి దించేయాలి
  • బాగా చల్లారాక బయటకు తీసి ప్లేట్‌లో ఉంచి ఆరనివ్వాలి టగాలి చొరని  డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

పీనట్‌ బటర్‌  ఓట్‌మీల్‌ కుకీస్‌
కావలసినవి:
పీనట్‌ బటర్‌ – అర కప్పు; బ్రౌన్‌ సుగర్‌ – అర కప్పు; ఓట్స్‌ – ఒకటిన్నర కప్పులకు కొద్దిగా తక్కువ; కోడి గుడ్డు – 1; బేకింగ్‌ సోడా – అర టీ స్పూను.

తయారీ:

  • చిన్న పాత్రలో పీనట్‌ బటర్, బ్రౌన్‌ సుగర్‌ వేసి బాగా కలపాలి
  • కోడిగుడ్డు సొన జత చేయాలి టఓట్స్, బేకింగ్‌ సోడా జత చేసి క్రీమీగా అయ్యేవరకు బాగా కలపాలి
  • కుకీస్‌ తయారు చేసుకునే పాత్రకు కొద్దిగా వెన్న పూయాలి టతయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని సమానంగా సద్దాలి
  • వేడి చేసుకున్న కుకర్‌లో ఉంచి, సన్న మంట మీద పావు గంట తరవాత దించేయాలి
  • చల్లారాక బయటకు తీసి, ప్లేట్లోకి తీసి, బాగా చల్లారాక గాలిచొరని పాత్రలోకి తీసుకుని నిల్వ చేయాలి.


తేనె పెరుగు బిస్కెట్స్‌
కావలసినవి: తేనె – పావు కప్పు; మైదా – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – టీ స్పూను; సాదా పెరుగు – ఒకటిన్నర కప్పులకు కొద్దిగా తక్కువ.

తయారీ:

  • ఒకపాత్రలో మైదా పిండి, ఉప్పు, తేనె వేసి బాగా కలపాలి
  • పెరుగు జత చేసి ఫోర్క్‌తో ముద్దలా అయ్యేవరకు కలపాలి
  • వెడల్పాటి గిన్నెలో పిండిని పొడిపొడిగా చల్లాలి టతయారుచేసి ఉంచుకున్న పిండి మిశ్రమాన్ని అర అంగుళం మందంగా వేసి మధ్యకు మడవాలి
  • మరోసారి పొడి పిండి చల్లి మళ్లీ మధ్యకు మడవాలి
  • బిస్కెట్‌ కటర్‌తో గుండ్రంగా కట్‌ చేయాలి టవీటిని పాత్రలో ఉంచి ముందుగా వేడి చేసిన కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి
  • మంట బాగా తగ్గించాలి టసుమారు పావు గంట తరవాత స్టౌ ఆపేయాలి
  • అర గంట తరవాత కుకర్‌ మూత తీసి తయారైన బిస్కెట్లను మరో ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారిన తరవాత, గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి.
మరిన్ని వార్తలు