ఆ ఒక్కపని చేస్తే చాలు.. జీన్స్‌ ఉతకనవసరం లేదు!

30 May, 2023 13:30 IST|Sakshi

దుస్తులు మన జీవితంలో ప్రధానభాగం. రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అయితే పురుషులకు, మహిళలకు వేర్వేరు రకాల దుస్తులు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజుల్లో అటు పురుషులు, ఇటు మహిళలు జీన్స్‌ ధరిస్తున్నారు. రఫ్‌ అండ్‌ టఫ్‌గా ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నందునే జీన్స్‌పై అందరూ మోజు పెంచుకుంటున్నారు. ట్రావెలింగ్‌ మొదలుకొని రోజువారీ ఆఫీసు వినియోగానికి సైతం అందరూ జీన్స్‌ వినియోగిస్తున్నారు.

జీన్స్‌ ధారణ మనిషికి మంచి లుక్‌నిస్తుంది. కొందరు జీన్స్‌ను తరచూ ఉతుకుతుంటారు. అయితే ఇది సరైన విధానం కాదని నిపుణుల చెబుతుంటారు. జీన్స్‌ను జాగ్రత్తగా కాపాడుకునేందుకు దానిని ఫ్రిజ్‌లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. జీన్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వలన ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీన్స్‌ను తరచూ ఉతకడం వలన ఆ దుస్తులకు హాని కలుగుతుంది. ప్రపంచానికి తొలిసారి జీన్స్‌ పరిచయం చేసిన ప్రముఖ కంపెనీ లెవీస్‌ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం జీన్స్‌ను ఎప్పుడూ ఉతకకూడదు. చాలా అవసరమైతే తప్పు దానిని ఉతకవద్దు అని పేర్కొన్నారు.

అయితే జీన్స్‌ను ఉతకకుండా దానిని శుభ్రపచడం ఎలా అనే సందేహం మనలో తలెత్తుతుంది. జీన్స్‌ను ఉతికితే ఆ దుస్తుల మెటీరియల్‌ పాడయిపోతుంది. అలాగే జీన్స్‌ను ఉతకడం వలన నీరు కూడా వృథా అవుతుంది. లెవీస్‌ సీఈఓ చిప్‌బర్గ్‌ తెలిపిన వివరాల ప్రకారం నూతన జీన్స్‌ను కనీసం 6 నెలల తరువాతనే వాష్‌ చెయ్యాలి. అయితే జీన్స్‌ను.. దానికి అతుక్కునే బ్యాక్టీరియా నుంచి కాపాడేందుకు దానిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే ఫ్రిజ్‌లో నుంచి జీన్స్‌ను బయటకు తీసి, ఎండలో లేదా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంచాలి. ఫలితంగా అది బ్యాక్టీరియా రహితంగా మారుతుంది. అప్పుడు దానిని తిరిగి ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు