‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా!

12 Dec, 2021 10:15 IST|Sakshi

ఇంగ్లిష్‌ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలాంటి సినిమాలు చూసి, లేదా కథలు చదివి మనం వినోదం పొందుతాం. ఇలా రుధిరాన్ని ఆస్వాదించే కారెక్టర్స్‌ను వాంపైర్స్‌ అని పిలవడం కూడా మనకు తెలుసు. కానీ వాంపైరిజమ్‌ అనే కండిషన్‌ ఉందన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతోకొంత రుచి చూస్తాడు. చటుక్కున వేలు తెగినప్పుడు చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. జరిగే రక్తస్రావాన్ని ఆపేందుకే ఇలా చేస్తారు. అయినప్పటికీ ఇలా తన రక్తాన్ని రుచిచూసే ఆ ప్రక్రియకు ‘‘ఆటో వాంపైరిజమ్‌’’ అంటారు.

ఇది సాధారణం.  అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఇంకా అసాధారణమైన కండిషన్‌ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్‌ ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇలా రక్తం తాగాలనే కోరిక పుట్టడాన్ని ‘‘క్లినికల్‌ వాంపైరిజమ్‌’’ అంటారు. ఇక మరికొందరిలో ఇది ఓ రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్‌ఫీల్డ్స్‌ సిండ్రోమ్‌’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన (బిహేవియరల్‌) రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ చికిత్స అందిస్తారు.

చదవండి: ‘యూ బ్లడీ ఫూల్‌’ అంటూ బాతు నోట తిట్టు!

మరిన్ని వార్తలు