ఎప్పుడూ ‘యూత్‌ఫుల్‌’గానే ఉండాలంటే! 

26 Feb, 2023 02:30 IST|Sakshi

అప్పట్లో ఓ కోలా యాడ్‌లో ఓ ఇంగ్లిష్‌ జింగిల్‌ వస్తుండేది. ‘‘ఎనీ వేర్‌ ఇన్‌ ద వరల్డ్‌... ఇట్స్‌ గ్రేటు బి యంగ్‌’’ అని. పూర్తి శరీరాన్నంతటినీ, ఆమాటకొస్తే లోపలి అవయవాలనూ, వాటి కండరాలను కూడా కప్పి ఉంచే చర్మాన్ని యూత్‌ఫుల్‌గా ఉంచేది ‘కొలాజెన్‌’ అనే ప్రోటీన్‌. అదెలా పొందవచ్చో, తద్వారా చాలాకాలం టుమధ్యవయసు లుక్‌నూ,వృద్ధాప్య లక్షణాలనూ దూరంగా ఉంచడం ఎలాగో, వయసు పెరుగుతున్నా (ఏజింగ్‌ జరుగుతున్నా) యూత్‌ఫుల్‌గా నిత్యయౌవనులుగా కనిపించడం ఎలాగో తెలిపే కథనం ఇది. 

వయసు పెరుగుతుంటే కొందరిలో చుబుకం కింద, కొందరిలో కళ్ల కిందున్న చర్మం కాస్త కాస్తగా జారుతుంటుంది. స్కిన్‌ జారిపోవడానికి కారణంగా ‘కొలాజెన్‌’ అనే ప్రోటీన్‌ లోపించడమే. కొలాజెన్‌ స్వాభావికంగానే వృద్ధి చెందడానికి ఏయే ఆహారాలు తీసుకోవాలో, అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎలాంటి ప్రక్రియలు అవలంబించవచ్చో తెలుసుకుందాం. 

కొలాజెన్‌ అంటే... 
నిజానికి ఇదో ప్రోటీన్‌. చర్మంలో ఎక్కువగా ఉంటుంది. కేవలం చర్మంలోనే కాకుండా దేహంలోని అనేక అవయవాల్లో... అంటే కండరాల్లో, ఎముకల్లో, టెండన్స్,  కణజాలాల్లో, రక్తనాళాల్లో, జీర్ణవ్యవస్థలోని అన్ని భాగాల్లో... ఆ మాటకొస్తే మనకు ఎక్కడైనా గాయం తగిలినప్పుడు, గాయం మానే సమయాల్లో ఇలా అన్ని ప్రదేశాల్లోనూ ఉంటుంది.  

ఆహారంతోనే కొలాజెన్‌  పొందడమెలా? 
మాంసాహారాల్లో... చికెన్‌
చేపలు (అందునా ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే ట్యూనా, మాకరెల్స్‌తో టు షెల్‌ఫిష్‌ వంటివి)
♦ గుడ్డులోని తెల్లసొన భాగం 

శాకాహారాల్లో...
♦ అన్ని రకాల నిమ్మజాతి పండ్లు (అంటే నిమ్మ, నారింజ, బత్తాయి, కమలాల వంటివి)
♦ బెర్రీ పండ్లు (అంటే... రాస్ప్‌బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌ బెర్రీ వంటివి) 
♦ ట్రాపికల్‌ ఫ్రూట్స్‌లో (అంటే... మామిడి, జామ, పైనాపిల్, ద్రాక్ష, కివీ... వీటిల్లో ఉండే జింక్‌ కూడా యాంటీ ఏజింగ్‌కు అదనంగా ఉపయోగపడే పోషకం) 

వంటలో వాడే పదార్థాల్లో :
♦ వెల్లుల్లి (ఇందులో కొలాజెన్‌ను సమకూర్చే పోషకాలు చాలా ఎక్కువ)
♦ ముదురు ఆకుపచ్చరంగులో ఉండే లకూర లాంటి అన్ని ఆకుకూరల్లో  చిక్కుళ్లు
♦ టొమాటో
♦ బెల్‌పెప్పర్‌లతో టు
♦ జీడిపప్పు, బాదంపప్పు లాంటి నట్స్‌లో.
♦ ఇవేగాకప్రో టీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే అన్ని ఆహారాలూ కొలాజెన్‌ ఉత్పత్తికి బాగా తోడ్పడతాయి). 

కొలాజెన్‌కు ప్రతికూలంగా పనిచేసే ఆహారాలు ఇవీ: 
 చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, బాగా రిఫైన్స్‌ చేసిన కార్బోహైడ్రేట్లు కొలాజెన్‌కు కొంత ప్రతికూలంగా పని చేస్తాయి.  

కొలాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే కొన్ని బ్యూటీ ప్రక్రియలు: 
అలోవేరా జెల్‌ : అలోవేరా జెల్‌ను చర్మంపై పూయడం, నోటి ద్వారా ‘ఆలో స్టెరాల్స్‌’ తీసుకోవడం. ఈ ప్రక్రియలు కనీసం ఎనిమిది వారాలు కొనసాగాలి.  

జిన్‌సెంగ్‌ : హెర్బల్‌ ఉత్పాదన అయిన జిన్‌సెంగ్‌ను తీసుకోవడం. దీన్ని టీ, టింక్చర్స్‌ లేదా సప్లిమెంట్స్‌గా తీసుకోవచ్చు. 

రెటినాల్స్‌ అండ్‌ కెరొటినాయిడ్‌ సప్లిమెంట్స్‌: బీటా కెరోటిన్‌ ఎక్కువగా దొరికే... మాంసాహారాల్లో కాలేయం, శాకాహారాల్లో చిలగడదుంప, గుమ్మడి, క్యారెట్స్‌ తీసుకోవడం. 

వైద్యచికిత్సా ప్రక్రియల సహాయంతో... 
థ్రెడ్స్‌ ట్రీట్‌మెంట్‌: వీటిల్లో ఫ్లోటింగ్, ఫ్రీ, కాగ్‌ థ్రెడ్స్‌ అని రకరకాల చికిత్సలు ఉంటాయి. పేషెంట్‌ అవసరాన్ని బట్టి డాక్టర్‌ వీటిల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేస్తారు. ప్రభావం నెల తర్వాత తెలుస్తుంది. ఈ చికిత్స ప్రభావం ఏడాది వరకే ఉంటుంది. కాబట్టి మళ్లీ మళ్లీ చేస్తుండాలి. 

పీఆర్‌పీ థెరపీ ఫర్‌ ఫేస్‌: ఈ చికిత్సలో పేషెంట్స్‌ నుంచి రక్తాన్ని సేకరించి, అందులోని ప్లేట్‌లెట్‌ సేకరించి ముఖానికి ఇంజెక్షన్‌ రూపంలో ఇస్తారు. ఇందులోనే పీఆర్‌ఎఫ్‌ (ఫైబ్రిన్‌), గ్రోత్‌ఫ్యాక్టర్‌ కాన్సంట్రేట్‌ పీఆర్‌పీ అనే కొత్త కొత్త చికిత్సలూ అందుబాటులోకి వచ్చాయి. దీన్ని నెలకొకసారి చొప్పున కనీసం 4 – 5 సార్లు చేయాలి.  

మైక్రో నీడ్లింగ్‌ ఆర్‌ఎఫ్‌ : రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఉపయోగించి ముఖంపై ముడుతలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. 

ఫ్రాక్షనల్‌ సీఓటూ లేజర్‌ : లేజర్‌ను ఉపయోగించి, ముఖాన్ని తేటగా చేయడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. 

హైఫూ : హై ఇంటెన్సిటీ ఫోకస్‌ అల్ట్రాసౌండ్‌ అనే మాటకు హైఫూ సంక్షిప్త రూపం. దీన్ని వివిధ తీవ్రతలతో వాడుతూ, సాగిన చర్మాన్ని బిగుతుగా చేయడానికి, డబుల్‌చిన్‌ తొలగించడానికి ఉపయోగిస్తుంటారు. 

హైలూరానిక్‌ యాసిడ్‌ ట్రీట్‌మెంట్‌ : శరీరంపైన పూసే క్రీములు, ఆయింట్‌మెంట్ల రూపంలోనూ,  ఇంజెక్షన్ల రూపంలోనూ, అలాగే స్కిన్‌ బూస్టర్‌ ఇంజెక్షన్స్‌ ఇస్తారు. దీని వల్ల చర్మానికి మంచి హైడ్రేషన్‌ సమకూరి, ఏజింగ్‌ ఆలస్యం అవుతుంది. 

రెడ్‌ లైట్‌ థెరపీ : చర్మాన్ని ఇన్‌ఫ్రా రెడ్‌ కిరణాలతో కూడిన ఎరుపురంగులో ఉండే కాంతి కిరణాలకు ఎక్స్‌పోజ్‌ చేయడం వల్ల చర్మంలో, దేహంలో కొలాజెన్‌ కొంత ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఇదే ప్రధాన థెరపీలాగా  కాకుండా... మిగతా చికిత్సలతో టు దీని ఓ అదనపు చికిత్సగానే పరిగణించాలి. 

ఓరల్‌ కొలాజెన్‌ పౌడర్స్‌ ఎన్‌రిచ్‌డ్‌ విత్‌ వైటమిన్‌ సి అండ్‌ యాంటీఆక్సిడెంట్స్‌ : ఇవి నోటి ద్వారా తీసుకునే పౌడర్లు. ఇవే గాక ఇలాంటి ఇంజెక్షన్లూ లభ్యమవుతాయి. 

చేయకూడనివి... లేత ఎండకు ఎక్స్‌పోజ్‌ కావడం పరవాలేదు. అది చర్మానికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ తీవ్రమైన ఎర్రటి ఎండ, దేహం కమిలిపోతున్నంత ఎండ వేడిమికి ఎక్స్‌పోజ్‌ కాకుండా కాడుకోవాలి. 

గమనిక :  ఎప్పుడైనా, ఎక్కడైనా స్వాభావికాలే మేలు. వైద్య ప్రక్రియలను ఆచరించాలను కుంటే స్వాభావికమైన ఆహారాలనే  తీసు కుంటూ, ఈ ప్రక్రియల్నీ తీసుకుంటేనే ఉపయోగం ఉంటుంది. అంతేతప్ప పూర్తిగా వైద్యపరమైన చికిత్సలే కొలాజెన్‌ పెరుగుదలకు ప్రామాణికాలు కావు. ఒకవేళ కొలాజెన్‌ వృద్ధి కోసం వైద్యపరమైన ప్రక్రియలను తీసుకోవాల్సి వస్తే పూర్తిగా క్వాలిఫైడ్‌ డర్మటాలజిస్టుల నేతృత్వంలోనే తీసుకోవాలి. 


- డాక్టర్‌ స్వప్నప్రియ సీనియర్‌ డర్మటాలజిస్ట్‌  

మరిన్ని వార్తలు