వాలెంటైన్‌ డే.. ఏ కలర్‌ డ్రెస్‌ బెస్ట్‌..?!

13 Feb, 2021 19:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాలెంటైన్‌ డే ను అర్ధవంతంగా, ఆనందంగా జరుపుకోవాలనే వారు ఈ రోజుకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఆ రోజున నచ్చిన వారికి గులాబీలను, కానుకలు ఇచ్చి తమ ప్రేమను పంచుకుంటారు. ప్రత్యేకమైన ఈ రోజున ఏ కలర్‌ డ్రెస్‌ వేసుకుని బయటకు వెళితే ఏంటో అనే ఆలోచన ఉండేవాళ్లూ సహజం. సహజంగానే రెడ్‌ కలర్‌ ప్రేమకు, పసుపు స్నేహానికి.. అని బేరీజులు వేసుకునేవారూ ఉంటారు. కలర్‌ డ్రెస్సింగ్‌ విషయంలో గ్లోబల్‌ వైజ్‌గా ఉన్న కలర్‌ఫుల్‌ ముచ్చట్లివి.. 

నీలం: ఈ రంగు డ్రెస్‌ను వాలెంటైన్‌ డే రోజున ధరిస్తే ‘ఎవ్వరితోనూ ప్రేమలో లేను’ అనే అర్ధమట. 
ఎరుపు: ఎలాంటి సందేహం లేకుండా ప్రేమకు చిహ్నంగా ఈ రంగును వాడుతూనే ఉంటారు. ఎరుపు రంగు డ్రెస్‌ ధరిస్తే ‘ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు’ అని గుర్తు అట. 
పచ్చ:  ‘ఆశ’ను చిగురంపజేసే సుగుణం ఆకుపచ్చ రంగుకు ఇచ్చేశారు. సో.. ఎదురుచూడండి అని చెప్పకనే చెబుతున్న విషయమట.

ఆరెంజ్‌ ప్రేమికుల రోజున నచ్చినవారికి ‘ప్రపోజ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ అన్నమాటట. 
నలుపు: హాట్‌ కలర్‌గా పేరున్న రంగు నలుపు. ఈ డ్రెస్‌లో ఎవరినైనా ఇట్టే కట్టిపడేయచ్చు. కానీ, ప్రేమికుల రోజున దీనిని ధరిస్తే మాత్రం ‘విఫల ప్రేమ’కు అర్ధమట. 
తెలుపు: ఈ రంగు ప్రేమికుల రోజున ఎదుటివారికి మనల్ని ఎలా పరిచయం చేస్తుందంటే.. మీకు ‘వేరొకరితో ‘పెళ్లికి నిర్ణయమైపోయింద’ని అర్ధమట.

పసుపు: ఎలాగూ ఈ రంగు గురించి తెలిసిందే సింపుల్‌గా ‘ఫ్రెండ్‌షిప్‌’ అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఈ రోజున కేవలం స్నేహానికే నా ప్రాముఖ్యత అని పసుపు రంగు డ్రెస్‌ ద్వారా తెలియజేయడం. 

బూడిద: ‘నా కెవ్వరిమీదా ఇంట్రస్ట్‌ లేదు’ అనే వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం గ్రే కలర్‌ ఇస్తుందట. 
పింక్‌: గులాబీ రంగును ప్రేమికుల రోజున ధరించారు అంటే మీరు ‘ప్రపోజల్స్‌కి సిద్ధం’గా ఉన్నారని అర్ధం వస్తుందట. అందుకని, పింక్‌ డ్రెస్‌ ధరించేవారు కొంచెం ఆలోచించుకోవాలట. 
పర్పుల్‌: వంగపండు రంగు అంటారు దీన్నే. ‘మొదటి చూపులోనే ఎవరితోనో ప్రేమలో పడ్డారు’ అని తెలిసిపోతుందట. 

పీచ్‌: ‘నాకు ఫ్రెండ్స్, పార్టనర్‌ లేరు’ అనే భావం వస్తుందట. ఎదుటి వారు కొంత జాలి కూడా చూపుతారట. అందుకని, పీచ్‌ కలర్‌ డ్రెస్‌ ధరించేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదట. 

చదవండి:
సింగర్ సునీతకు ‘వాలెంటైన్’ డే సర్‌ప్రైజ్‌

కిస్‌ చేస్తే ఇది ‘మిస్‌’ కారు..

మరిన్ని వార్తలు