డయాబెటిస్‌ పేషెంట్స్‌కి ఈ వ్యాధుల ఎటాక్‌ అయితే..డేంజర్‌లో ఉన్నారని అర్థం!

29 Jun, 2023 09:41 IST|Sakshi

మధుమేహం లేదా చక్కెర వ్యాధిని వైద్య పరిభాషలో డయాబెటిస్ మెల్లిటస్ అని వ్యవహరిస్తారు. డయాబెటీస్ అని కూడా పిలిచే ఈ వ్యాధి ఇన్సులిన్‌ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం. ఇది వస్తే పేషెంట్‌లు ఎలా ఉంటారనే దాని గురించి అందరికి తెలిసిందే. దీనికి పూర్తిగా నివారణ లేదు గానీ కొన్ని జాగ్రత్తలు, ఆరోగ్య నియమాలను పాటించడం ద్వారా మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవడమే గాక సులభంగా బయటపడవచ్చు. ఐతే ఈ డయాబెటిస్‌ పేషెంట్లకి రోగ నిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉన్నందున కొన్ని రకాల అంటువ్యాధుల వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధుల వచ్చాయి అంటే మీరు డేంజర్‌లో ఉన్నట్లు అర్థం. సత్వరమే మేల్కోని తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతకం కాకుండా చూసుకోవచ్చు. 

డయాబెటిస్‌ రోగులుకు సాధారణంగా వచ్చే అంటువ్యాధులు

  • నేషనల్‌ లైబ్రెరీ ఆప్‌ మెడిసినల్‌ అధ్యయనాల ప్రకారం..పేషెంట్లో ఆరు శాతం మంది ఇన్ఫెక్షన్ల సంబంధింత వ్యాధుల కారణంగా ఆస్పత్రుల చేరి మరణాల వరకు సంభవించిన కేసులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఎముకలు, కీళ్ల ఇన్ఫక్షన్‌లకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 
  • పాదాలలో చలనం తగ్గి గాయమైన తెలయకపోవడం. ఆ తర్వాత క్రమంగా అది పెద్దదిగా మారి దాని నుంచి శరీరమంతా ఇన్ఫక్షన్‌ వ్యాపించి ప్రాణాంతకంగ మారిని కేసులు ఎక్కువే.
  • ఆయా రోగులకు అంత్యభాగంలో రక్తప్రసరణ సరిగా జరగదు. దీంతో ఆయా ప్రాంతాల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే ఏదైన వ్యాధి వస్తే ఈజీగా ఇన్షక్షనే అయ్యే ప్రమాదం ఎక్కువ. 
  • రకరకాల చర్మ సమస్యలు వచ్చినా మధుమేహం ఎక్కువగా ఉంది అనడానికి ప్రధమ సంకేతం
  • గోరుచుట్టు, యూరినరీ ఇన్ఫక్షన​్‌లు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
  • చెవి, ముక్కు, గొంతు ఇన్ఫక్షన్‌లు వచ్చిన సాధారణంగా భావించొద్దు. 
  • అలాగే స్త్రీలల్లో జననేంద్రియాలలో ఏదైన ఇన్ఫక్షన్‌ల వచ్చిన తేలికగా తీసుకోవద్దు. లైంగికంగా సంక్రమించే వ్యాధుల మాదిరిగా ఉంటాయి. అందువల్లే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాడం ఉత్తమం. 

(చదవండి: కొబ్బరినీళ్లతో ఇన్ని ప్రయోజనాలా?.. మరి డయాబెటిక్‌ పేషెంట్స్‌ తాగొచ్చా?)

మరిన్ని వార్తలు